Star Heroine: ఈ క్యూట్ గర్ల్.. ఇప్పుడు గ్లామర్ క్వీన్
ABN , Publish Date - Jan 19 , 2025 | 06:11 PM
Star Heroine: ఆ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలలో వైవిధ్యభరితమైన కథలతో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటుంది. అలాగే ఈ బ్యూటీ తాత, తండ్రి, అత్త తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. ఇంకా ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేదా ఆ హీరోయిన్ ఎవరంటే..
1995లో రిలీజైన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ 'రాంబంటు' సినిమా అంటే చాలామందికి ఇష్టం. ఇప్పటికి ఈ సినిమా టీవీల్లో వచ్చిందంటే ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తుంటారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ యాక్టింగ్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇక ముళ్ళపూడి వెంకటరమణ రాసిన ఈ కథను బాపు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం కూడా హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా ఈశ్శ్వరి రావు, దొరగారి పాత్రలో కైకాల సత్యనారాయణ, ఇతర పాత్రల్లో కోట శ్రీనివాస్ రావు, ఏవీఎస్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల తదితరులు నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో తాజాగా ట్రెండింగ్ లో ఉన్న బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఒకరు నటించారు. ఆమె ఎవరో మీకు తెలుసా..
ఈ సినిమాలో పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే పాటలో రాజేంద్రప్రసాద్, ఈశ్వరిల మధ్యలో ఉన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాట మధ్యలో ఓ చిన్నది వచ్చి తెగ సందడి చేస్తుంది. ఆ చిన్నది రాజేంద్రప్రసాద్ ని అందులో ముందు కూడా పెట్టుకుంటుంది. ఆ సీన్ చేయడానికి ఆమె 15 టేక్స్ తీసుకుందంట. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఆ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలలో వైవిధ్యభరితమైన కథలతో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటుంది. అలాగే ఈ బ్యూటీ తాత, తండ్రి, అత్త తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. ఇంకా ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేదా ఆ హీరోయిన్ ఎవరంటే..
ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలిచినా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో భాగ్యం పాత్రలో అదరగొట్టిన 'ఐశ్వర్య రాజేష్' అండి. ఐశ్వర్య తండ్రి రాజేష్.. తెలుగువాడే ఆయన ప్రముఖ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన`నెలవంక` సినిమాలో 'సలీమ్' పాత్రలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. జంధ్యాల తెరకెక్కించిన రెండు జళ్ల సీత, ఆనంద భైరవి సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే చిరంజీవి నటించిన పల్లెటూరి మొనగాడు, బాలకృష్ణ సీతారామకళ్యాణం, కృష్ణంరాజు ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మాణ్ణ చిత్రాల్లో విలన్ గా నటించాడు. మరో 50కిపైగా చిత్రాలలో కీలక పాత్రల్లో నటించాడు.