Gopi Sunder: సంగీత దర్శకుడు గోపీసుందర్ ఇంట విషాదం..
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:42 PM
‘'అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేేస ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది" అని గోపి సుందర్ పోస్ట్ చేసారు
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ (Gopi SUnder) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె (Gopi sunder mother is nomore) గురువారం కేరళలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ..
‘'అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేేస ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’ అంటూ భావోద్వేంగా పోస్ట్ పెట్టారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరిగాయి. (Gopi sunder music director)
మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్‌కి కేరాఫ్ అడ్రస్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చారు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలేభలే మగాడివోయ్ ఊపిరి, మజిలీ, నిన్నుకోరి, ది ఫ్యామిలీ స్టార్, 18 పేజెస్ తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.