Ghaati: క్రిష్ సినిమాలో మరో డైరెక్టర్
ABN , Publish Date - Jan 15 , 2025 | 10:23 AM
Ghaati: ఇప్పటికే క్రిష్.. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన 'హరి హర వీర మల్లు' వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఘాటీ సినిమా కోసం మరో తమిళ డైరెక్టర్ అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ..
బాహుబలి సిరీస్ మూవీస్ తర్వాత, అనుష్క, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మ్యాసీవ్ పాన్ ఇండియా మూవీ ఘాటి (Ghaati) తో రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ , మలయాళం భాషల్లో ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు.
అయితే ఇప్పటికే క్రిష్.. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన 'హరి హర వీర మల్లు' వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఘాటీ సినిమా కోసం మరో తమిళ డైరెక్టర్ అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ డైరెక్టర్ గా కాదు, యాక్టర్ గా. ఆయనెవరో కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ గా సౌతిండియాలో అన్ని ఇండస్ట్రీలకు పరిచయమున్న వెంకట్ ప్రభు. తాజాగా ఘాటీ మేకర్స్ సినిమాలో ఆయన లుక్ ని రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు.
మరోవైపు క్వీన్ అనుష్క తాను ఎలాంటి పాత్రనైనా పోషించగలనని మరోసారి తన వెర్సటాలిటీని ప్రూవ్ చేసుకుంటుంది. ఇలాంటి ఫెరోషియస్ యాక్షన్ ఓరియెంటెడ్ సీన్స్ ఆమెకు మాత్రమే పెర్ఫెక్ట్. ఆమె అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటి సినిమాలో టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.