నరసరావుపేటలో గీతా ఆర్ట్స్‌ మల్టీప్లెక్స్‌..

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:46 PM

తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌ల విస్తరణ దూకుడుగా సాగుతోంది. టాలీవుడ్‌ టాప్‌ హీరోలు, నిర్మాతలు థియేటర్ల విస్తరణపై దృష్టిసారిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌ల విస్తరణ దూకుడుగా సాగుతోంది. టాలీవుడ్‌ టాప్‌ హీరోలు, నిర్మాతలు థియేటర్ల విస్తరణపై దృష్టిసారిస్తున్నారు. మెల్లగా మల్టీపెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థ ఇప్పటికే తమ బ్రాండ్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. ఏషియన్‌ సినిమాస్‌, యు.వి క్రియేషన్స్‌ వీ సెల్యూలాయిడ్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ తదితర సంస్థలు తమ మల్టీప్లెక్స్‌లను విజయవంతంగా నడుపుతున్నాయి. 

WhatsApp Image 2025-03-21 at 2.02.45 PM (1).jpeg

ఇప్పటికే భీమవరంలో గీతా మల్టీప్లెక్స్‌తో (Geetha Multiplex) ఓ బడా థియేటర్‌ నడుపుతున్న గీతా ఆర్ట్స్‌ సంస్థ మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనుంది. నరసరావుపేటలో ఏర్పాటు చేసిన గీతా మల్టీప్లెక్స్‌ మార్చి 28న గ్రాండ్‌గా లాంచ్‌ కాబోతోంది.  ఇది మూడు స్క్రీన్ లతో  సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ మార్కెట్లో ప్రీమియం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు సిద్థమవుతోంది. ఇందులో అత్యాధునిక 4కె డాల్బీ ఆప్టిమైజ్డ్‌ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్‌ కాసు సెంట్రల్‌ మాల్‌లో ఏర్పాటు చేయడం మరో విశేషం. గతంలో మల్టీప్లెక్స్‌ అనేది మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం అయితే, ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా ఇవి విస్తరిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం తెలుగు సినిమా మార్కెట్‌ విస్తృతంగా పెరగడం, టికెట్‌ ధరల నియంత్రణ విధానం కొంతవరకు మల్టీప్లెక్స్‌ల అభివృద్థికి అనుకూలంగా మారడం. గీతా మల్టీప్లెక్స్‌ ఇప్పుడు నరసరావుపేటలో ప్రారంభం కావడం అందుకు మంచి ఉదాహరణ. సినిమా ప్రొడక్షన్‌ ఎగ్జిబిషన్‌ రంగంలో గీతా ఆర్ట్స్‌ ఇప్పటికే బలమైన స్థాయిని ఏర్పరచుకుంది. ఇది నరసరావుపేటకు మాత్రమే కాకుండా, ఆ ప్రాంతానికి వచ్చిన సినిమా ప్రియులకు పెద్ద శుభవార్తే.

Updated Date - Mar 21 , 2025 | 05:46 PM