Gautham Ghattamneni : మహేశ్ తనయుడి నటనకు ఫిదా..
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:15 PM
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను బయటపెడుతూ..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ (Gautham Ghattamneni) న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను బయటపెడుతూ ఇటీవల ఓ స్కిట్‌లో పాల్గొన్నాడు గౌతమ్. తోటి విద్యార్థితో కలిసి అతడు చేసిన ఈ స్కిట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ఆరంభంలో నవ్వుతో ప్రశాంతంగా కనిపించిన గౌతమ్.. కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలకు లోనై డైలాగ్‌లు చెబుతూ కనిపించారు. దీనిని చూసిన నెటిజన్లు గౌతమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గౌతమ్ యాక్టింగ్ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. గౌతమ్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన తండ్రి బాటలోనే నటుడిగా రాణించాలని ఆశిస్తున్నాడు.
ఇందులో భాగంగా నటనలో శిక్షణ పొందుతున్నారు. కొన్నాళ్ల క్రితం లండన్‌లో తొలి స్టేజి షో ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ‘‘గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. చూసిన వారంతా ఎంజాయ్ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను బయటకు తీసేందుకు ‘జాయ్ ఆఫ్ డ్రామా’ నిర్వహించే సమ్మర్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మహేశ్ హీరోగా నటించిన ‘1 నేన్కొక్కడినే’లో గౌతమ్ ఛైల్డ్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.