Game Changer Twitter Review: రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:43 AM
Game Changer Twitter Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ భారీ అంచనాలతో శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? శంకర్ కంబ్యాక్ ఇచ్చారా? రామ్ చరణ్ ఇతర నటులు ఎలా చేశారు? సినిమా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు అంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో లెజండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. కియారా అద్వానీ కథానాయకి. ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. మరి ఈ సినిమా చూసిన వాళ్లు తమ ఫీలింగ్‌ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియ జేస్తున్నారు. మరి వారి అభిప్రాయాలు ఉలా ఉన్నాయంటే..
కొందరు ఈ సినిమాని బెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అభివర్ణిస్తున్నారు. రామ్ చరణ్ యాక్షన్ మోడ్ లో అదరగొట్టాడు అంటున్నారు. శంకర్ డైరెక్షన్ అదిరిపోయిందని టాక్. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కియారా మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ హైలెట్ అంటున్నారు.
ఇక మరికొందరు ఈ సినిమా జస్ట్ ఓకే అని చెప్తున్నారు. వరుస ప్లాప్స్ తో సతమతవుతున్న శంకర్ కు ఇది కంబ్యాక్ ఇచ్చే సినిమా అయితే కాదు అంటున్నారు. కేవలం చరణ్ నటన, థమన్ స్కోర్ మాత్రమే సినిమాని నిలబెట్టాయి అంటున్నారు. కథ విషయానికొస్తే రొటీన్ కమర్షియ్ ప్లాట్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ లవ్ ట్రాక్, బలంలేని కామెడీ ఉంటాయి అన్నారు. కానీ.. ఇంటర్వెల్ లో వచ్చే సీన్ ఇంట్రెస్టింగ్ సెకాండాఫ్ కి దారి తీస్తోందన్నారు. ఇక సెకాండాఫ్ స్టార్టింగ్ లోనే 20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వింటేజ్ శంకర్ ని గుర్తు చేస్తుందన్నారు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అదరగొట్టారు అని టాక్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో అభిమానులు, కొందరు విమర్శకులు.. ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్, నెగిటివ్ రివ్యూలను ఇస్తారు కాబట్టి పూర్తిగా ఆ రివ్యూలను నమ్మలేము. సమగ్రమైన పూర్తి విశ్లేషణ, రివ్యూ కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మీరు సినిమా అభిమానులు అయితే జాగ్రత్తగా టైమ్ చూసుకొని థియేటర్‌లో చూడటమే ఉత్తమం.