Game Changer: మిస్సైన విజువల్ వండర్.. ‘నానా హైరానా’

ABN , Publish Date - Jan 10 , 2025 | 09:56 AM

Game Changer: 'గేమ్ ఛేంజర్' మూవీ ట్రైలర్, సాంగ్స్‌లో కనిపించిన విజువల్ వండర్స్ ఈ రోజు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు.. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పాటల కోసం అంతా ఖర్చు పెట్టిన.. చివరకు ఏమైంది అంటే..

NaaNaa Hyraanaa song missing in theatres

శంకర్ సినిమా అంటే విజువల్ వండర్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఖాయం.. అలాంటి శంకర్ సినిమాలో అదే మిస్ అయ్యింది. తాజాగా రిలీజైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఎన్నో అంచనాలతో వెళ్లిన ఫ్యాన్స్ కి ఒక విషయంలో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సినిమాలో పాటల కోసం దర్శకుడు శంకర్.. నిర్మాత దిల్ రాజుతో రూ. 75 కోట్లు ఖర్చు పెట్టించిన విషయం తెలిసిందే. అయితే ఏమైందంటే..


భారతీయ సినిమాల్లో తొలిసారి ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ ‘నానా హైరానా’. ఈ సాంగ్ ని మెలోడీ అఫ్ ది ఇయర్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. త‌మిళంలో ‘లై రానా’ ఈ సాంగ్ తెగ సందడి చేసింది. ఈ విజువల్ ఫీస్ట్ ని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలనీ అంతా వేచి చూశారు. కానీ.. ఈరోజు థియేటర్ లలో సినిమా చూస్తుంటే.. ఈ సాంగ్ కనిపించలేదు. దీంతో అందరు అవాక్కయ్యారు. అయితే ఈ సాంగ్ లో ఇన్ ఫ్రారెడ్ ఇమేజెస్ ను ప్రాసెస్ చేయడం యూనిట్ కు కష్టంగా మారిందంట అందుకే సకాలంలో థియేటర్ లలో అందించలేకపోయారట. జనవరి 14 నుంచి ఈ సాంగ్ థియేటర్ లలో ప్లే కానుంది.


పాట విషయానికి వస్తే.. ప్రేమ‌లో ఉన్న హీరో హీరోయిన్లు ఒక‌రిపై ఒక‌రికి మ‌న‌సులోని ప్రేమ భావాలను ప‌దాల రూపంలో అందంగా అమ‌ర్చిన‌ట్లు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. మేకింగ్ లో శంక‌ర్ మ‌రోసారి పాట‌ల‌ను చిత్రీక‌రించ‌టంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాట‌ను ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు. ఒక్కో స‌న్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీతో పాట మ‌న‌సుని ఆహ్లాద ప‌రుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌ని అనిపించేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీ (వెస్ట్ర‌న్‌, క‌ర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బ‌ర్న్ట్ టోన్స్‌ను ఉప‌యోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాట‌లో ఉప‌యోగించ‌టం విశేషం. సారెగ‌మ మ్యూజిక్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు.

Updated Date - Jan 10 , 2025 | 10:31 AM