బాబాయ్ లాంటివారిని చూసే శంకర్ ఇలా రాసుంటారు 

ABN , Publish Date - Jan 05 , 2025 | 10:23 AM

"సినిమాలో నేను గేమ్‌ చేంజర్‌ని కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్‌ పాలిటిక్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ గారు రియల్‌ గేమ్‌ చేంజర్‌. పవన్‌ కళ్యాణ్‌ గారి లాంటి వారిని చూసే  శంకర్‌ గారు ఇలాంటి పాత్రలు రాసి ఉంటారు’’ అని రామ్‌ చరణ్‌ అన్నారు.

"సినిమాలో నేను గేమ్‌ చేంజర్‌ని (Game Changer)కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్‌ పాలిటిక్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ గారు రియల్‌ గేమ్‌ చేంజర్‌. పవన్‌ కళ్యాణ్‌ గారి లాంటి వారిని చూసే శంకర్‌ గారు ఇలాంటి పాత్రలు రాసి ఉంటారు’’ అని రామ్‌ చరణ్‌ (Ram Charan) అన్నారు. ఆయన హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం రాజమండ్రిలో జరిగింది.

ఈ వేడుకలో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘రాజమండ్రి బ్రిడ్జ్‌ మీద పవన్‌ కళ్యాణ్‌ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు జన సంద్రం కనిపించింది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన చిడిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గారికి థాంక్స్‌. మంచి సినిమా చేశాం. అందరిని అలరించేలా దర్శకుడు తెరకెక్కించారు. ఇంకో సందర్భంలో మరింత మాట్లాడుతాను. నన్ను క్షమించండి’ అని అన్నారు.

శంకర్‌ మాట్లాడుతూ ‘‘నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు పవన్‌కల్యాన్‌ దగ్గరకు వెళ్లాను. ఆయన మమ్మల్ని ఎంతో బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఎంతో చక్కగా మాట్లాడారు. ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలనుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్‌ రాజు గారు, రామ్‌ చరణ్‌ గారికి థాంక్స్‌. మినిస్టర్‌, కలెక్టర్‌కు జరిగే వార్‌ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ అద్భుతంగా ఉంటుంది. రామ్‌ చరణ్‌ గారు తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు. అంజలి, కియారా, శ్రీకాంత్‌ గారు, నవీన్‌ చంద్ర, ఎస్‌ జే సూర్య, ఇలా అందరూ చక్కగా నటించారు. తమన్‌ మంచి సంగీతాన్ని ఇచ్చారు’’ అని అన్నారు.

2222 (5).jpg

దిల్‌ రాజు మాట్లాడుతూ.. శంకర్‌ గారు ఈ కథను చెప్పిన మన రాష్ట్రంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. రామ్‌ చరణ్‌ గారు మూడు డిఫరెంట్‌ పాత్రల్లో కనిపిస్తారు. రామ్‌ చరణ్‌ గారి నటన అద్భుతంగా ఉండబోతోంది. తమన్‌ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సంక్రాంతికి రాబోతోన్న చిత్రాలకు టికెట్‌ రేట్ల పెంపు కోసం జీవో ఇచ్చిన ప్ఘ్రభుత్వానికి థాంక్స్‌. జనవరి 10న మా చిత్రం రాబోతోంది. పెద్ద విజయం సాధించబోతోన్నామనే నమ్మకంతో ఉన్నాం’ అని అన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ..‘సినిమా సినిమాకి ఎదుగుతూ వస్తున్న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గారిని ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్‌ ఇక్కడ జరుగుతుండటం సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమకు కావాల్సిన అనుమతులు, ప్రోత్సాహం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ సినిమా గేమ్‌ చేంజర్‌లా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

GC.jpg

ఎస్‌ జే సూర్య మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన్ను ఇలా చూడటంతో నాకు మాటలు రావడం లేదు. ఈ ఈవెంట్‌ చరిత్రలో నిలవబోతోంది. ఆయన రావడమే ఈ ఈవెంట్‌కు ప్రత్యేకత. నా జీవితంలో ఏ ఆర్‌ రెహమాన్‌, పవన్‌ కళ్యాణ్‌ గారు నా ఆలోచనా ధోరణిని మార్చేశారు. ఖుషి కథ చెప్పినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ గారు కొన్ని మార్పులు చెప్పారు. ఓ పాటను, మూడు ఫైట్లను యాడ్‌ చేశారు. మాట ఇస్తే నిలబడాలి అని పవన్‌ కళ్యాణ్‌ గారు నాకు నేర్పారు. గేమ్‌ చేంజర్‌లో రామ్‌ చరణ్‌ గారు రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శంకర్‌ గారు విజన్‌, తమన్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. రామ్‌ చరణ్‌తో నాకు ఉండే సీన్లు నెక్ట్స్‌ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ పర్ఫామెన్స్‌కు అవార్డు వస్తుందని సుకుమార్‌ గారు చెప్పారు. అప్పన్న పాత్రలో రామ్‌ చరణ్‌ ఇరగ్గొట్టేశారు. సంక్రాంతికి రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్‌ గారికి థాంక్స్‌. ఎస్‌ జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నాను. సినిమా సినిమాకు రామ్‌ చరణ్‌ తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటాడు. అప్పటికీ ఎప్పటికీ రామ్‌ చరణ్‌ బిహేవియర్‌లో ఏమీ మారలేదు. సుకుమార్‌ గారు చెప్పినట్టు ఈ సినిమాకు జాతీయ అవార్డు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

OK.jpg

అంజలి మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో ఈవెంట్‌ జరుగుతుంటే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడి నుంచే వెళ్లి హీరోయిన్‌గా మారి.. మళ్లీ ఇప్పుడు గేమ్‌ చేంజర్‌ కోసం ఇలా రావడం ఆనందంగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌ గారితో వకీల్‌ సాబ్‌లో పని చేశాను. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎదిగారు. ఈ రోజు మాకోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. నటిగా డిఫరెంట్‌ పాత్రలు చేయాలని అందరికీ ఉంటుంది. నా తల్లి పేరు పార్వతి. ఈ చిత్రంలో నేను పోషించిన కారెక్టర్‌ పేరు పార్వతి. నాకు ఈ కారెక్టర్‌ చాలా టచ్‌ అయింది. నాకు ఇంత మంచి పాత్రను రాసిన, ఇచ్చిన శంకర్‌ గారికి థాంక్స్‌. దిల్‌ రాజు గారి ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న మూడో చిత్రమిది. ఈ రోజు ఇక్కడ వినబోయే సాంగ్‌ నాకు చాలా స్పెషల్‌. రామ్‌ చరణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. జనవరి 10న గేమ్‌ చేంజర్‌ రాబోతోంది. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి’ అని అన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 10:23 AM