Game Changer: 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ పాత్ర ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా..
ABN , Publish Date - Jan 10 , 2025 | 09:19 AM
Game Changer: తమిళనాడు కేడర్‌కు చెందిన 'పని బకాసురుడు' అని పిలిచే అధికారి నుండి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారట. ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాకకీయ నాయకులను గడగడలాడించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' శుక్రవారం థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల నుండి హిట్ టాక్, మరికొన్ని ప్రాంతాల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇదంతా పక్కనపెడితే ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు లుక్ లలో అదరగొట్టినట్లు టాక్. ఒకటి కాలేజ్ లో లుక్, రెండు IAS అధికారిగా, మూడు తండ్రి పాత్రల్లో అప్పనగా నటించాడు. ప్రస్తుతం అప్పన్న పాత్రకి మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఈ సినిమాలో చరణ్ IAS అధికారిగా నటించిన పాత్రకు రియల్ లైఫ్ IAS అధికారి ఇన్స్పిరేషన్. ఇంతకీ ఆయన ఎవరంటే..
గేమ్ ఛేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్ వహించగా కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన విషయం తెలిసిందే. చరణ్ కూడా పలు ఇంటర్వ్యూలలో తన పాత్రకు ఇన్స్పిరేషన్ అయినా అధికారి వీడియోలు, వర్క్ చెక్ చేసుకునే వాడిని అని చెప్పారు. అలాగే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆ పాత్రను చేయడం గర్వంగా ఫీల్ అవుతున్న అని చెప్పేవారు. రైటర్ కార్తీక్ ఈ పాత్రను తమిళనాడు కేడర్ కు చెందిన 'పని బకాసురుడు' అని పిలిచే IAS అధికారి TN శేషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారట. శేషన్ చాలా అరుదైన గొప్ప ప్రభుత్వ అధికారి.
తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్.. టిఎన్ శేషన్.. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరు. కానీ.. 90వ దశకంలో దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనమైన పేరు. ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాకకీయ నాయకులను గడగడలాడించారు. ఆయన భారత ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలకు ఆద్యం అయ్యారు. కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా పని చేసిన ప్రతి శాఖల్లోనూ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రజా, పర్యావరణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. దీంతో ఆయన చుట్టూ అనేక కేసులు, వివాదాలు తిరిగాయి.