Game Changer: బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Jan 11 , 2025 | 08:46 AM
Game Changer: నిర్మాత దిల్ రాజు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేసింది అంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన శంకర్ తెరకెక్కించిన సినిమా ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను రాబట్టుకుంటోంది. ప్రధానంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా 'అప్పన్న' పాత్రలో చరణ్ జీవించాడు. సినిమా టాక్ ఎలా ఉన్న అన్ని ప్రాంతాల నుండి మంచి కలెక్షన్స్ రాబడుతున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేసింది అంటే..
రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలిరోజు రూ. 47 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో రూ. 38 కోట్లు తెలుగు రాష్ట్రాల నుండే రావడం గమనార్హం. ఇక బుక్ మై షో వెబ్ సైట్‌లో తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా గేమ్ ఛేంజర్ టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించారు. వీకెండ్, పండుగ కలిసి రావడంతో సేల్స్, కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఉత్తర ప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న రామ్ నందన్ (రామ్ చరణ్), తన ప్రియురాలు దీపిక (కియారా అద్వాణీ) చెప్పిన మాట కోసం ప్రయత్నించి ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యి, తన సొంత జిల్లా వైజాగ్‌కు కలెక్టర్‌గా వస్తాడు. వైజాగ్ వచ్చీ రాగానే అక్కడ ఉన్న రౌడీ షీటర్స్‌కి, రాజకీయ నాయకుల సహకారంతో దందాలు చేసే వాళ్లకి వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్‌తో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య)కి, రామ్ నందన్‌కి మధ్య వార్ మొదలవుతుంది. మరోవైపు తన తండ్రి సీఎం సత్యమూర్తి (శ్రీకాంత్) సీట్ కోసం మోపిదేవి చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వాడికి తలనొప్పిగా మారిన రామ్ నందన్‌ని పొలిటికల్ పవర్ ఉపయోగించి మోపిదేవి ఏం చేశాడు? మోపిదేవి ప్రయత్నాలను రామ్ నందన్ ఎలా తిప్పికొట్టాడు? ఈ క్రమంలో సీఎం సత్యమూర్తి ఎలా చనిపోయాడు? ఆయన చనిపోతూ తన కొడుకుని కాదని.. రామ్ నందన్‌కి సీఎం సత్యమూర్తి బాధ్యతలను ఎందుకు అప్పగించాడు? అసలు అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి) ఎవరు? రామ్ నందన్ కథలోకి వారెలా వచ్చారు? అనేది స్టోరీ..
చేశాడు.