Gama Awards 2025 'గామా' వేడుక ఎప్పుడు ఎక్కడంటే..
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:00 PM
నటుడు రఘు కుంచె సమక్షంలో ‘గామా అవార్డ్స్ 2025’ ఐదవ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ జరిగింది. దుబాయ్‌లోని అజ్మాన్, మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఆ వేడుకకు సుమారు 500 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు అయ్యారు. ఈ వేదికగా కార్యక్రమం వివరాలు వెల్లడించారు.
‘గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్(గామా అవార్డులు -Gama -2025) గల్ఫ్ దేశాల్లో రెండో అతి పెద్ద దేశమైన ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’లోని దుబాయ్ సిటీ వేదికగా కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అవార్డ్స్ ప్రోగ్రాం ఎప్పుడు నిర్వహించేది ఆర్గనైజర్స్ వెల్లడించారు. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె (RagunKunche)సమక్షంలో ‘గామా అవార్డ్స్ 2025’ ఐదవ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ జరిగింది. దుబాయ్‌లోని అజ్మాన్, మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఆ వేడుకకు సుమారు 500 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు అయ్యారు. ఈ వేదికగా కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు గామా అవార్డ్స్ నాలుగుసార్లు జరిగాయి. ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులను అవార్డులు అందజేశారు. కరోనా కారణంగా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ... దుబాయ్ సిటీలో భారీ ఎత్తున తెలుగువారి సమక్షంలో ఈ అవార్డ్స్ వేడుక నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ‘గామా అవార్డ్స్’ను జూన్ 7వ (Gama awards on 7th july) తేదీన దుబాయ్ షార్జా ఎక్స్పో (Dubai Sharja Expo) సెంటర్‌లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ‘గామా అవార్డ్స్’ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ దర్శకులు ఎ కోదండ రామిరెడ్డితోపాటు సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు బి గోపాల్ సహా మరికొందరు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల వేడుకకు వచ్చే అతిథి లతోపాటు వీరి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు.
‘
'గామా’ గురించి రఘు కుంచె మాట్లాడుతూ ‘’గామాతో నాకు మంచి అనుబంధం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి కళాకారులు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా. ఐదో ఎడిషన్ వరకు రావడం సంతోషం’’ అన్నారు.
‘గామా అవార్డ్స్’ అధ్యక్షడు పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ ‘’ఇప్పటి వరకు గామా అవార్డ్స్ నాలుగు ఎడిషన్లు జరిగాయి. ఐదో ఎడిషన్ మరింత భారీగా చేయబోతున్నాం. జూన్ 7, 2025న జరగబోయే ఈ వేడుకకు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం’’అన్నారు. "ఈసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి ‘ది గామా ఎక్స్‌లెన్స్ అవార్డ్స్’ ఇచ్చి సత్కరించనున్నాం. నామినేషన్లతోపాటుు పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తాం’’ అని గామా సీఈవో సౌరబ్ కేసరి చెప్పారు.