8 Vasanthalu: మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా 'అందమా... అందామా' గీతం
ABN , Publish Date - Mar 03 , 2025 | 05:59 PM
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన హార్ట్ టచ్చింగ్ మూవీ '8 వసంతాలు'. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
మైత్రి మూవీ మేకర్స్.... పాన్ ఇండియా చిత్రాలే కాదు... కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు ఓటేస్తోంది. అందులో భాగంగా బ్యూటీఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌తో పాటు న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా ను తెరకెక్కిస్తోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala) హీరోగా, 'మ్యాడ్' మూవీ(Mad Movie) హీరోయిన్ అనంతిక సునీల్ కుమార్ (Ananthika Suneel Kumar) తో తెరకెక్కుతున్న మూవీ '8 వసంతాలు' (8 Vasanthalu) . ఇప్పటికే రిలీజైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా... తాజాగా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా 'అందమా అందమా....' అంటూ సాగే పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సోల్ ఫుల్ నెంబర్స్ కి పాపులరైన హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) అందమైన లవ్ మెలోడీని స్వరపరిచాడు. మనసు దోచుకున్న అమ్మాయి పట్ల తన ప్రేమ, అనురాగాన్ని ప్రజెంట్ చేసేలా సాగే ఈ పాట కట్టేపడేస్తోంది. మ్యూజిక్ స్పెషల్ అసెట్ గా నిలిచింది. ఈ పాట వింటుంటే ఫీల్ గుడ్ టచ్ ను ఇచ్చింది. వనమాలి సాహిత్యం అందించగా... హేషమ్ అబ్దుల్ వహాబ్, ఆవాని మల్హర్‌తో కలసి మెస్మరైజింగ్ గా ఈ పాటని ఆలపించారు. హను రెడ్డి, అనంతిక బ్యుటీఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.
'8 వసంతాలు' చిత్రంలో హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ , సమీరా కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన '8 వసంతాలు' హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
Also Read: Oscars 2025: అప్పుడు అన్నారు.. ఇప్పుడు అమలు చేశారు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి