Pongal 2025: సెలబ్రేషన్స్‌ షురూ.. సినీతారల విషెస్‌..

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:17 PM

తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్‌బాబు, విష్ణు పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ‘


దేశ వ్యాప్తంగా సంక్రాంతి (Makara Sankranti) సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. తెలుగువారి పెద్ద పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.  సోమవారం భోగి సందర్భంగా భోగి (Bhogi) మంటలు వేస్తూ.. సందడి చేస్తున్నారు. సినీ తారలు అభిమానులకు (Film celebs) శుభాకాంక్షలు చెబుతున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌ తేజ్‌, రామ్‌ పోతినేని కూడా విషెస్‌ తెలిపారు.

తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్‌బాబు, విష్ణు పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ప్రతి రోజు బాగుండాలని భగవంతుడిని కోరుకుంటాం. అందరూ బాగుండాలి. సంక్రాంతి అంటే రైతు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇలాంటి పండగలను ఆనందంగా జరుపుకోవచ్చు. సినిమా మిత్రులకు వారు తీసిన సినిమా హిట్‌ అయితేనే నిజమైన పండగ. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరవు కాటకాలు రాకూడదని, రైతు బాగుండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా పండగ చేసుకోండి’’ అంటూ అందరికీ సంక్రాంతి విషెస్‌ చెప్పారు మంచు విష్ణు.

mmm.jpg
వైజాగ్‌లో జరుగుతోన్న సంక్రాంతి వేడుకల్లో సాయికుమార్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. 1975 జనవరిలో తన మొదటి సినిమా విడుదలైందని.. తాను ఇండస్ర్టీకి వచ్చి 50 సంవత్సరాలు అయిందని అందుకే ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకమన్నారు. 

Updated Date - Jan 13 , 2025 | 12:24 PM