Sai Pallavi: ఫ్యాన్స్ క్వశ్చన్స్.. సాయిపల్లవి ఏం చెప్పిందంటే
ABN , Publish Date - Feb 06 , 2025 | 06:22 PM
అభిమానులు అడిగిన ప్రశ్నలను నాగచైతన్య సాయి పల్లవి ముందుంచారు. ఆమె ఆసక్తికర జవాబులు ఇచ్చింది. నటన కాకుండా ఇంకేమంటే ఇష్టమని ప్రశ్నించగా తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని, ఇటీవల మొదలు పెట్టానని చెప్పింది.
నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలను నాగచైతన్య సాయి పల్లవి ముందుంచారు. ఆమె ఆసక్తికర జవాబులు ఇచ్చింది. నటన కాకుండా ఇంకేమంటే ఇష్టమని ప్రశ్నించగా తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని, ఇటీవల మొదలు పెట్టానని చెప్పింది. సాయిపల్లవి బన్‌తో తయారు చేసే ఆహారం కూడా ఇష్టమే, అలాగే కొబ్బరి నీళ్లు, రాత్రి 9 గంటలైతే ఎక్కడున్నా నిద్రపోవడం అలవాటు అని నాగచైతన్య చెప్పారు.
మీరు దర్శకత్వం చేయాలనుకుంటే..(Sai Pallavi)
అలాంటి ఆలోచన ఏదీ లేదు.
నాగచైతన్య: నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఇదే విషయాన్ని అడిగితే, ‘ఎప్పటికైనా దర్శకత్వం చేస్తా నన్ను కూడా నటుడిగా తీసుకుంటానని చెప్పావు’
ఓం నమః శివాయలో చైతన్య డ్యాన్స్ చూసి మీకేమనిపించింది!
గతంలో చైతన్య డ్యాన్స్ చేస్తుండగా, అప్పుడప్పుడు వెనకడుగు వేసేవాడు. ఈ పాటకు మాత్రం ముందుకు దూకి మరీ ఇరగదీశాడు.
ఏదైనా ఫిక్షనల్ క్యారెక్టర్‌తో డిన్నర్ చేయాలనుకుంటే ఎవరితో ప్లాన్ చేస్తారు.
ఒక్కరితో కాదు. సింప్సన్స్ (అమెరికన్ యానిమేటెడ్ సిట్‌కామ్) కుటుంబంతో చేయాలనుంది.
అబ్బాయిలు డ్రెసింగ్ ఎలా ఉంటే ఇష్టం..
నాకు తెలీదు కానీ నలిగిపోయిన బట్టలు వేసుకుంటే నాకు నచ్చదు. నా ఫ్యామిలీ లో ఎవరైనా అలా కనపడితే, వాటిని సరి చేయడానికి ప్రయత్నిస్తా.
నాగచైతన్య: అబ్బాయిలు విన్నారుగా.. ఈసారి సాయిపల్లవిని కలిేస ముందు, మీ డ్రెస్‌ను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి వేసుకురండి.
శ్రీకాకుళంలో యాసలో మాట్లాడటం ఎలా అనిపించింది?
ఆ మాటలు పలకడానికి కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం. గతంలో తెలంగాణ యాస నేర్చుకుని మాట్లాడా. అలాగే ఇది కూడా.
‘తండేల్’ సెట్‌లో చైతన్య చెప్పిన అతి పెద్ద అబద్థం?
చైతన్య సెట్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. నేను అక్కడలేని సమయం చూసుకుని, ‘పల్లవి నన్ను పిలిచి, ఆ సీన్‌లో ఇలా చేద్దాం.. అలా చేద్దాం.. అని చెబుతోంది’ అంటాడు. నా మాట వినిపించగానే సైలెంట్ అయిపోతాడు!
ఖాళీ సమయంలో ఏం చేస్తారు?
నేను నాలా ఉండటానికి ప్రయత్నిస్తాను. సినిమాలు చూస్తా. వంట చేయాలనుకుంటా కానీ, చేయలేను. ఆర్డర్ పెట్టి తినేస్తా తోట పనిచేస్తాను. క్యారెట్లు పండిస్తాను.
వాట్సాప్ స్టికర్స్ వాడతారా?
కోతుల స్టికర్స్ ఎక్కువగా వాడతా.