Fake Collections: అంతా ఫేకే.. అందుకే ఐటీ దాడులు
ABN , Publish Date - Jan 24 , 2025 | 11:11 AM
Fake Collections: "ఎన్ని ఐటీ రైడ్స్ జరిగిన, అరెస్టులైనా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకునేది సాధారణ అభిమానులు మాత్రమే. సో, సినీ ప్రేమికులారా వివేకంతో ఆలోచించండి సరైన నిర్ణయాలు తీసుకోండి."
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న వార్త ఐటీ రైడ్స్. గొప్పలకు పోయి మా సినిమా గొప్పది అంటే మా సినిమా ఇంకా గొప్పది అన్నట్లు పోస్టర్లపై ఇష్టమొచ్చినట్టు నంబర్లు వేసుకొని ప్రచారాలు చేసుకుంటూ ప్రేక్షకులని మభ్యపెట్టారు. వాస్తవానికి కొన్నేళ్ల నుండి ఒక సినిమా ఒరిజినల్ కలెక్షన్ ఇది అని కరెక్ట్ గా చెప్పే సోర్స్ లేకుండా పోయింది. దీంతో మేకర్స్ ఇష్టమొచ్చినట్లు నంబర్స్ వేసుకుంటూ పోతున్నారు.
అసలు లెక్క సినిమా బడ్జెట్ ల దగ్గరే స్టార్ట్ అవుతుంది. సినిమాకి అంతా పెట్టుబడి ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ఓకే ఫైనాన్స్ తెచ్చుకుంటున్నారు. తప్పులేదు కానీ.. దీంట్లో సగానికి మించి రెమ్యునరేషన్ లకే పోతుంది. అయితే ప్రేక్షకుడు ఏం ఆలోచిస్తాడంటే.. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి టెక్నీకల్ గా వండర్ చూడనున్నానని ఫిక్స్ అయ్యి.. వేలకు వేలు టికెట్లకు తలిగేస్తున్నారు. కానీ వాళ్ళు పరోక్షంగా హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు పే చేస్తున్నం అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. మరోవైపు బడ్జెట్ అంతా రెమ్యునరేషనలకే పోవడంతో సినిమా నిర్మాణంలో అనేక లోటుపాట్లు కనపడుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమాని ఆదరించకపోవడంతో ఫేక్ పోస్టర్లతో, మార్కెటింగ్ గారడీలతో తిరిగి ప్రేక్షకుల వద్దే ముక్కుపిండి మరి కలెక్షన్స్ వసూళ్లు చేసుకుంటున్నారు.
ఇక ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే మరో చెత్త విషయం.. ' మా హీరో ఫ్లాప్ మూవీకి వచ్చిన కలెక్షన్స్ అంతా ఉండదు రా.. మీ హీరో హిట్టు సినిమా కలెక్షన్' అని గొప్పగా చెప్పుకుంటారు. అయితే.. ఒక ఫ్లాప్ సినిమాకి గొప్ప కలెక్షన్స్ రావడం ఒక ఫెల్యూర్. ముఖ్యంగా ఆ సినిమాకి అభిమానులే రిపీటెడ్ గా వెళ్లి కంటెంట్ లేని సినిమాలకు డబ్బు వేస్ట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో దగ్గరుండి మరి సినిమా మార్కెటింగ్ చేస్తుంటారు. ఎవరైనా రివ్యూ ఇస్తే.. బూతుల దాడి, చంపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తారు. ఇదంతా చేసిన వాడికి ఏమైనా డబ్బు వస్తుందా అనే రాదూ. ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెస్ తప్ప. ఇప్పటికే సినీ కుటుంబాలకు, హీరోలకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కవ ఇస్తూ బానిసల్లాగా పనిచేస్తామంటే పూర్తి అజ్ఞానం అవుతోంది. సినిమా నీ వృత్తి కానంత వారికి దాన్ని కాలక్షేపంగానే చూడు. ఎందుకంటే అది నీ బ్లడ్, బ్రీడ్ కాదు కాబట్టి.
ఎన్ని ఐటీ రైడ్స్ జరిగిన, అరెస్టులైనా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకునేది సాధారణ అభిమానులు మాత్రమే. సో, సినీ ప్రేమికులారా వివేకంతో ఆలోచించండి సరైన నిర్ణయాలు తీసుకోండి.