RC16: రత్నవేలు సినిమా జానర్‌ ఏంటో చెప్పేశారు..

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:06 PM

'ఆర్ సి16' సినిమాకు వర్క్‌ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు (Dop Rathnavelu) సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అందరిలోను ఆసక్తిని పెంచుతోంది.

రామ్‌ చరణ్‌ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు (Sana Buchibabu) దర్శకత్వంలో 'ఆర్‌సీ16' (RC16) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఇటీవల తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఇతివృత్తంతో ఈ సినిమా రానున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమాకు వర్క్‌ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు (Dop Rathnavelu) సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అందరిలోను ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్‌ స్పాట్‌లోని ఓ ఫోటో షేర్‌ చేసి ‘‘నైట్‌ షూట్‌, ఫ్లడ్‌ లైట్స్‌, క్రికెట్‌ పవర్‌, డిఫరెంట్‌ యాంగిల్స్‌’’ అని కాప్షన్‌ పెట్టారు.

క్రికెట్‌ స్టేడియంలో ఉండే లైట్‌ల ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. ఇంతకుముందు కూడా ఆయన సినిమా గురించి పెట్టిన పోస్ట్‌ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిచింది. ఈ సినిమాలో ఓ సీన్‌ను ఫిల్మ్‌ కెమెరాతో తెరకెక్కించనున్నట్లు ఇటీవల ఆయన తెలిపారు.  సహజత్వం కోసం అలా చేయనున్నట్లు పేర్కొన్నారు.  ‘‘పూర్తిస్థాయిలో నెగెటివ్‌ రీల్‌తో షూటింగ్‌ చేయడం సాధారణ విషయం కాదు. డిజిటల్‌ కెమెరాలతో షూటింగ్‌ చేస్తుంటే.. నటులు ఎన్ని టేక్స్‌ తీసుకున్నా సమస్య ఉండదు. అదే నెగెటివ్‌ ఉండే కెమెరాలతో చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం’’ అని అన్నారు.


Ram-charab.jpg

బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్‌ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్థం కానున్నట్లు సమాచారం. జాన్వీకపూర్‌ కథానాయిక. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్థి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.  ఇప్పటికే మ్యూజిక్‌ వర్క్స్‌ మొదలయ్యాయని.. రెండు పాటలు కూడా పూర్తి చేశానని ఇటీవల రెహమాన్‌ తెలియజేశారు.

Updated Date - Feb 08 , 2025 | 12:58 PM