Kalpana Health update: కల్పన ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్లు ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:54 PM
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న గాయని కల్పనా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మాట్లాడారు.
సింగర్ కల్పన రాఘవేంద్రన్ (Singer Kalpana) అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాతో మాట్లాడారు. కల్పన రికవరీ ( Kalpana health update) అవుతున్నారని చెప్పారు. ఆమె వైద్యం అందించిన డాక్టర్ మాట్లాడుతూ అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరిన ఆమెకు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్‌మెంట్ చేశాం. ఊపిరితిత్తుల్లోకి వాటర్ చేరింది. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ కూడా ఉంది. ఆమెకు ఇంకా చికిత్స అవసరం. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. ప్రస్తుతం ఆక్సిజన్ కూడా తీసి వేసాము. నార్మల్ గానే శ్వాస తీసుకుంటున్నారు. గురువారం వరకూ లిక్విడ్ ఫుడ్ అందించాం ఇప్పుడు నార్మల్ ఫుడ్ తీసుకుంటుంది. సమయానికి సరైన చికిత్స అందించడం వల ఆమె కోలుకోగలిగారు. మానసికంగా ఆమెకు కౌన్సెలింగ్ (Counceling For Kalpana) నిర్వహించాము’’ అని తెలిపారు.
సంగీత కుటుంబంలో పుట్టిన కల్పనకు చిన్నప్పటి నుంచి సంగీతం, పాటలు అంటే ప్రాణం. చిన్ననాటి నుంచే సాధన చేసి గాయనిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ బాషల్లో వందలాది పాటల పాడారు. 1991లో ఆమె తొలి పాట పాడారు. మహేశ్ నటించిన వంశీ చిత్రంలో 'సరిగమ’ తెలుగులో ఆమె పాడిన తొలిపాట. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'ప్రేమంటే సులువు కాదురా’ (ఖుషి), 'ముసుగు వేయొద్దు మనసు మీద' (ఖడ్గం), 'అమ్మడు అప్పచి' (ఇంద్ర), 'ఏ జిల్లా ఏ జిల్లా'(శంకర్ దాదా ఎంబీబీఎస్), 'జూలే జూలే(వర్షం)', 'ఏ ఊరే చిన్నదానా (భద్ర) 'వంటి హిట్ సాంగ్స్ పాడారు.
ALSO READ: Ayesha takia: గూండాలు ఎవరో తెలుసుకుని మాట్లాడండి
Reba Vs Ketika: అందాల భామల హాట్ సాంగ్స్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి