SSMB29 Update: ఎస్‌ఎస్‌ఎంబీ లేటెస్ట్ అప్‌డేట్ అంటూ వైరల్
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:21 PM
మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ-29' సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చిన వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో తెలుసా
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (mahesh Babu)ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో సందడి చేశారు. రాజమౌళి (SS rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎస్‌ఎస్‌ఎంబీ-29 (SSMB29) చిత్రీకరణ కోసం బుధవారం కొరాపుట్‌కు చేరుకున్నారు. అనంతరం దేవ్‌మాలి పర్వతంపై బస చేేస ప్రాంతానికి వెళ్లారు. ఆయనతోపాటు మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటిస్తున్నారని వస్తున్న వార్తలు ఈ సెట్లో ఆయన కనిపించడంతో నిజమయ్యాయి. ఈ నెల 28 వరకు తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లోకేషన్లలో చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తోలోమాలి పర్వతంపై ఇప్పటికే ప్రత్యేక సెట్‌ను వేశారు. కొద్ది రోజుల్లో మిగతా నటీనటులు షూట్‌లో పాల్గోనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే రామమౌళి మాత్రం చాలా పకడ్భందీగా సినిమా పనులు కానిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని బయటకు రానివ్వలేదు. ఏదైనా ఇన్‌వర్గాల నుంచి వచ్చిందే వార్త అన్నట్లు ఉంది. (Mahesh Charector Name)
తాజాగా ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించిన ఓ క్లూ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ 'రుద్ర’ (Rudra)అని పాత్రలో కనిపిస్తాడట. ‘అతడు’లో పార్థు, ‘పోకిరి’లో.. పండు, ‘గుంటూరు కారం’లో రమణ, ‘ఖలేజా’లో సీతారామరాజు, బిజినెస్‌మెన్‌లో సూర్య భాయ్, ఇలా మహేష్ సినిమా టైటిల్సే కాదు.. తన క్యారెక్టర్ పేరులోనూ ఓ యునిక్‌నెస్ ఉంటుంది. మరి ‘రుద్ర’ (Rudra) అనే క్యారెక్టర్ పేరును మహేష్ ఫ్యాన్స్ ఎంత వరకూ రిసీవ్ చేసుకొంటారో చూడాలి.
ఈ మధ్యనే గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజులపాటు షూట్ చేశారు. ఓ కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ షూట్ లో మహేష్, ప్రియాంకా చోప్రాతోపాటు నానా పటేకర్ కూడా పాల్గొన్నారని తెలిసింది. ఈ సినిమాలో నానా పటేకర్ మహేష్ తండ్రిా నటించనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా టీమ్ ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఒడిశాలో మొదలైంది. ఈ చిత్రం కోసం ‘గరుడ’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి, ఇంగ్లిష్ టైటిల్ కోసం చిత్రబృందం ట్రై చేస్తోంది.
ALSO READ: Kalpana Health update: కల్పన ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్లు ఏమన్నారంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి