Vishwambhara: విశ్వంభర ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 01:23 PM

‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ పంచుకున్నారు. మ్యూజిక్‌ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట (Vassista) దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) . త్రిష (Trisha) కథానాయిక. యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ పంచుకున్నారు.

మ్యూజిక్‌ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. చిరంజీవి, కీరవాణి(MM Keeravani), చంద్రబోస్‌తో (Chandrabose) దిగిన ఫొటోను షేర్‌ చేసిన దర్శకుడు వశిష్ఠ.. అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు. ఆడియన్స్‌ ఈ పాటలు చూసి ఎంతో ఆనందిస్తారని ఆయన తెలిపారు. అలాగే ఈ సినిమాకు పని చేసిన సింగర్స్‌ టీమంతా కూడా ఫొటోలు షేర్‌ చేసి మెగా మోమెంట్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.  


Vishwambhara.jpgభారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. థియేటర్‌లో కూర్చొన్న ప్రేక్షకుడికి మరింత థ్రిల్‌ పంచుతుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం 13 భారీ సెట్స్‌ వేసి కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ విషయాన్ని దర్శకుడే గతంలో తెలిపారు. ఇందులో చిరంజీవి (Chiranjeevi) ఇంతకుముందు ఎన్నడూ కనిపించని సరికొత్త అవతారం లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఆయన నటించిన చిత్రాలతో కంపేర్‌ చేస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌(UV Creations) సంస్థ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. 

Updated Date - Jan 28 , 2025 | 01:34 PM