Trinadha Rao Nakkina: వాంటెడ్‌గా చేయలేదు.. తొందర్లోనే నోటీసులు పంపిస్తాం

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:40 PM

Trinadha Rao Nakkina: త్రినాధరావుకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఆయనకు కాస్త నోటి దురుసు ఎక్కువ. వేదికపైకి ఎక్కగానే ఏదో పూనకం వచ్చినట్లు మాటలొస్తాయి. గతంలో కూడా రెండు సార్లు ఇలాగే వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇప్పుడు 'మజాకా' సినిమా టీజర్‌ ఆవిష్కరణలో మరోసారి చీఫ్‌ కామెంట్స్‌ చేశాడు.

Trinadha Rao Nakkina

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో ప్రముఖ సినీ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. వల్గర్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మన్మధుడు ఫేమ్ అన్షు గురించి మాట్లాడుతూ.. దారుణమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై లోకమంతా భగ్గుమంటుంది. తాజాగా మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయన క్షమాపణలు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా ఘాటుగా స్పందించింది. త్రినాధరావు చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆయనకు నోటీసులు పంపిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అంటూ క్షమాపణలు వేడుకున్నాడు.


ఏం జరిగిందంటే..

'మజాకా' సినిమా టీజర్‌ ఆవిష్కరణలో ఆయన చీప్ కామెంట్స్‌ చేశాడు. మొదట వేదికపైకి వచ్చిన దర్శకుడు యాంకర్‌ గీతాభగత్‌పై సెటైర్లు వేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ షేకెండ్‌ ఇచ్చిన ఆమెను టచ్‌ బాగుండి అన్నాడు. పండగ బోణీ బావుంది అంటే వెకిలిగా మాట్లాడాడు. యాంకర్‌కు ఏం మాట్లాడాలో తోచని స్థితిలో ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. తదుపరి అతని దృష్టి హీరోయిన్‌ అన్షు మీదకు వెళ్లింది. ఆయనేదో ఈ మధ్యనే పుట్టినట్లు "నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది. అదే హీరోయిన్‌ మజాకాలో హీరోయిన్‌గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఆమె సన్నబడింది. ఈ సైజులతో ఉంటే కష్టం అమ్మా.. అంటూ బాడీ షేప్స్‌ గురించి అసౌకర్యంగా ఉండేలా ఏదేదో మాట్లాడాడు. పైగా తను చెప్పినట్లే లావు పెరిగిందని కూడా కామెంట్‌ చేశాడు. ఇంకా వేదికపై కొంత ఓవరాక్షన్‌ చేశాడు. మరోవైపు, ‘సెకండ్‌ హీరోయిన్‌ పేరు..’ (మర్చిపోయినట్టుగా) అంటూ తాగడానికి నీళ్లు అడగడం సైతం చర్చనీయాంశమైంది.

Updated Date - Jan 13 , 2025 | 05:01 PM