RGV: వర్మకు బిగ్ షాక్.. జైలు శిక్ష విధించిన కోర్టు
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:02 PM
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబై మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది . అసలు ఏమైందంటే..
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది ముంబై మేజిస్ట్రేట్ కోర్టు. 2018లో ఆయనపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. తాజాగా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆర్జీవీపై మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా కోర్టు విచారణకు ఆదేశించింది. కానీ.. ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు బాధితుడికి రూ. 3. 72 లక్షల పరిహారం అందించడంతో పాటు మూడు నెలల శిక్ష విధిస్తు.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. పరిహారం చెల్లించకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని వెల్లడించింది.