Dil Raju: అనిల్ మమ్మల్ని నిలబెట్టాడు.. దిల్ రాజు నోటి వెంటా అదే మాట!

ABN , Publish Date - Feb 01 , 2025 | 06:51 PM

సంక్రాంతికి వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా సక్సెస్‌ని పురస్కరించుకుని ఇప్పటికే ఎన్నో సక్సెస్ మీట్స్‌ జరిగాయి. శనివారం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

Dil Raju, Anil Ravipudi and Shrish

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కాంబోలో వచ్చిన పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్‌ని రాబట్టుకుని.. రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పొంగల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉన్న ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గానే థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సక్సెస్‌ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు కూడా ఇంతకు ముందు తన సోదరుడు మాట్లాడిన మాటలనే రిపీట్ చేశారు.


‘‘డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని చెప్పగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. థియేటర్‌లో సినిమా వచ్చి.. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి .కల్చర్ మారిపోయింది. 90 శాతం ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10 శాతం మాత్రమే సక్సెస్. మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నింటిని తట్టుకుని మాతో జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఆ 10 శాతంలోనే డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు మిగులుతాయి. డిస్ట్రిబ్యూషన్‌లో పోయిన ఆ 90 శాతం డబ్బుల ఎవరికీ కనిపించవు. 20 ఏళ్ల పాటు ఒక ప్రొడ్యూసర్‌తో డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా ఆరుదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ.


Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత

ఏ సినిమాకైనా బడ్జెట్ కాదు కథలే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని సక్సెస్‌లు, క్లాసిక్స్ వచ్చాయో అందరికి తెలిసిందే. మేము కూడా కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో.. గత నాలుగైదు ఏళ్ళుగా తడబడుతున్నాం. అనిల్ మళ్ళీ మాకు మా రూటు చూపించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషనల్ హిట్ ఇచ్చి ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఇకపై మా సంస్థ నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఇది మాకు ఒక బిగ్ ఎనర్జీ. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది.


Anil-Ravipudi.jpg

అనిల్‌ రావిపూడితో ఆరు సినిమాలు చేస్తే ఆ 6 విజయవంతం అయ్యాయి. అనిల్‌తో సినిమా తీసినప్పుడు నిర్మాతగా ఎప్పుడూ ఒత్తిడికి లోనవ్వలేదు. తనతో నాకు చాలా కంఫర్ట్‌బుల్ ఉంటుంది. నిజంగా.. ఎక్కడో పడిపోతున్న మమ్మల్ని పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈ సక్సెస్‌తో మరో పదేళ్లు తిరుగులేకుండా అద్భుతమైన సినిమాలు తీస్తాం. రిజల్ట్స్ 100 శాతం వస్తాయి. వెంకటేష్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో. ఆయన నిర్మాతలకు ఇచ్చే గౌరవం మాములుగా ఉండదు. అందుకే అద్భుతంగా ఆయనతో నాలుగు సినిమాలు చేయగలిగాం. ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’’ అని దిల్ రాజు ఈ స్టేజ్‌పై చెప్పుకొచ్చారు. అయితే, ఇంతకు ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఓ వేదికపై దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా అనిల్ రావిపూడిని ఉద్దేశిస్తూ.. పడిపోతున్న మమ్మల్ని నిలబెట్టేశాడనేలా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


Also Read- NBK: పదవులు మనకు అలంకారం కాదు.. మనమే ఆ పదవులకు అలంకారం కావాలి

Also Read- Kollywood Directors: కోలీవుడ్‌ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్‌ హీరోలు!

Also Read- Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 07:58 PM