Dil Raju: ఐటీ రైడ్స్‌పై దిల్ రాజు ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:06 PM
ఆదాయ పన్నుశాఖ దాడులపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైౖర్మన్ (టీజీఎఫ్‌డీసీ) దిల్‌రాజు స్పందించారు. ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగడం లేదని స్పష్టం చేశారు.
సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్నుశాఖ (IT raids) దాడులపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైౖర్మన్ (టీజీఎఫ్‌డీసీ) దిల్‌రాజు (Dil Raju) స్పందించారు. ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగడం లేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మొదలైన సోదాలు రెండో రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, ఆఫీస్‌ల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు. ఈ రెండు చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకొంది.