Dil Raju: అభిమాని మరణం.. రూ.10లక్షల ఆర్థిక సాయం
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:21 AM
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు.
శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్(Game Changer) ప్రీ రిలీజ్ (Game Changer Event) ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్‌రాజు (Dil Raju) మీడియా సమక్షంలో వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అని అన్నారు.