Dil Raju: ఆదాయ పన్ను కార్యాలయానికి దిల్‌రాజు

ABN , Publish Date - Feb 04 , 2025 | 10:50 AM

వారం క్రితం దిల్‌ రాజు (Dil Raju) కార్యాలయాలపై ఐడీ అధికారులు రైడ్‌ చేసిన సంగతి తెలిసింది. సోదాల అనంతరం ఓసారి ఐటీ కార్యాలయానికి (Income Tax Office) రావాల్సి ఉంటుందని ఆదేశించారు.


వారం క్రితం దిల్‌ రాజు (Dil Raju) కార్యాలయాలపై ఐడీ అధికారులు రైడ్‌ చేసిన సంగతి తెలిసింది. సోదాల అనంతరం ఓసారి ఐటీ కార్యాలయానికి (Income Tax Office) రావాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం దిల్‌ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. తన వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో డాక్యుమెంట్లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా దిల్‌రాజు నిర్మించిన రెండు భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. దిల్‌ రాజుతోపాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. (Dil Raju eay to IT office)
'
ఈ ఏడాదికి సంక్రాంతి బరి ఆయన 'గేమ్‌ ఛేంజర్‌'(Game Changer), 'సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) చిత్రాలను విడుదల చేశారు. గేమ్‌ ఛేంజర్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా, వెంకటేశ్‌ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్‌హిట్‌ టాక్‌తో ఆడుతోంది. ఇప్పటికి రూ.303 కోట్లు వసూళ్లు రాబట్టి భారీ విజయం నమోదు చేసుకుంది.

Updated Date - Feb 04 , 2025 | 10:50 AM