MR Perfect: పరిష్కారానికి ప్రయత్నించండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:08 PM

ప్రభాస్‌ (Prabhas) నటించిన 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' (Mr Perfect) సినిమా కాపీరైట్‌ కేసులో నిర్మాత దిల్‌రాజు 9(Dil Raju), దర్శకుడు దశరథ్‌కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

ప్రభాస్‌ (Prabhas) నటించిన 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' (Mr Perfect) సినిమా కాపీరైట్‌ కేసులో నిర్మాత దిల్‌రాజు 9(Dil Raju), దర్శకుడు దశరథ్‌కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తాను రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల ఆధారంగా సినిమా తీసి తన హక్కులకు భంగం కలిగించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముమ్మిడి శ్యామలారాణి అనే రైటర్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే! ఈ కేసులో ట్రయల్‌కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. అయితే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని సోమవారం దిల్‌రాజు తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.

కాపీరైట్‌ చట్టం (Copy Right Case) కింద తమపై నమోదుచేసిన కేసుకు కాలపరిమితి ముగిసినందున దాన్ని కొట్టేయాలని కోరుతూ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) , దశరథ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో తొలుత దిల్‌రాజు తరుఫున కృష్ణదేవ్‌ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసును ఇదివరకే హైకోర్టు కొట్టేసిందని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 468 కింద ఉన్న కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్‌యాక్ట్‌ సెక్షన్‌ 63 కింద నమోదైన కేసునూ కొట్టేయాలని కోర్టుకు విన్నవించారు.




ఈ సినిమా 2011 ఏప్రిల్‌ 20న విడుదలైంది. తన నవల ఆధారంగా తీశారంటూ రచయిత 2017 జులై 12న సీఆర్‌పీసీ సెక్షన్‌ 200 కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సినిమా నిరంతరం టీవీల్లో ప్రసారమవుతోంది కాబట్టి ప్రాధమికంగా ఇది నిరంతరంగాసాగే నేరంగానే కనిపిస్తోంది కాబట్టి ఆ అంశాన్ని తాము పరిశీలించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అందుకే ఈ కేసులో ప్రతివాదికి నోటీసులు జారీచేస్తూ రెండు వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించించారు. ఈ మధ్యకాలంలో ట్రయల్‌కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్‌పై ేస్ట విధిస్తున్నట్లు చెప్పారు. ‘‘సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు’’ అంటూ చివరలో ధర్మాసనం ముందుకు వచ్చిన దిల్‌రాజు తరుఫు సీనియర్‌ న్యాయవాది నిరంజ్‌రెడ్డికి జస్టిస్‌ సూచించారు. 

Updated Date - Feb 25 , 2025 | 04:27 PM