Dancer Kavya Suicide: ఢీ ఫేం కావ్య కల్యాణి ఆత్మహత్య.. కారణం అతనే!

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:30 PM

ఢీ షోలో డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కావ్యా కల్యాణి ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లో ఈ ఘటన జరిగింది.

ఢీ (Dhee Show) షోలో డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కావ్యా కల్యాణి (Kavya Kalyani) ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లో ఈ ఘటన జరిగింది. ఆమె మరణానికి కారణం ఢీ షో డాన్సర్‌ అభి అని చెబుతూ ఓ సెల్ఫీ వీడియో చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియో ద్వారా తల్లిదండ్రులను క్షమాపణ కోరింది కావ్యా(Kavya kalyani suicide).   "నాకు న్యాయం జరగాలి. అభి నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నారు. నన్ను ఇంటి నుంచి పొమ్మన్నాడు.  అందుకే నేను ఉరి వేసుకుంటున్నా. సారీ అమ్మ.. సారీ డాడీ అంటూ యువతి చేసిన వీడియో చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Updated Date - Mar 01 , 2025 | 03:31 PM