Dhandoraa : సమాజంలో దురాగతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:32 PM
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్న, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కించారు
‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి హిట్స్ అందుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’ (Dhandoraa). మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ బీట్ పేరుతో వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్న, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కించారు. టెక్నాలజీ పరంగా ఎన్నో మలుపులు తీసుకుని ముందుకెళుతోన్న నేటి సమాజంలో ఇప్పటికీ ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయా? అని ఫస్ట్ బీట్ (First Beat వీడియో చూస్తే తెలుస్తోంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్(Navdeep), నందు(Nandu), రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని (Ravindra Benarji) తెలియజేశారు.