Tarak: జపాన్ లో తారక్ అభిమాని ఏం చేసిందో చూడండి..  

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:38 PM

జపాన్‌లో దేవర సినిమా విడుదల సందర్భంగా తారక్ అక్కడికి వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు. సినిమాకు వస్తున్నా స్పందన,  పర్యటనపై ఎన్టీఆర్‌ (NTR) ఆనందం వ్యక్తం చేశారు.

జపాన్‌లో దేవర సినిమా విడుదల సందర్భంగా తారక్ అక్కడికి వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు. సినిమాకు వస్తున్నా స్పందన,  పర్యటనపై ఎన్టీఆర్‌ (NTR) ఆనందం వ్యక్తం చేశారు. ఓ అభిమాని తెలుగు నేర్చుకోవడంపై ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. (Japan Lady Fans)

‘‘జపాన్‌ ట్రిప్ నాకు ఎప్పుడు మంచి జ్ఞాపకాలను  అందిస్తుంటుంది. కానీ, ఈసారి భిన్నంగా అనిపించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని ఓ జపనీస్‌ అభిమాని చెప్పడం నన్ను కదిలించింది. భాషలు, సినీ అభిమానిగా.. విభిన్న సంస్కృతులతోపాటు భాష నేర్చుకునేందుకు సినిమా దోహదపడుతున్నందుకు సంతోషిస్తున్నా. భారతీయ సినిమా ప్రపంచస్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకుంటుందనేందుకు ఇది మరో కారణం’’ అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ మహిళా అభిమాని "అన్నా 'ఆర్ఆర్ఆర్" సినిమా చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. రెండేళ్ల  ముందు అమెజాన్ సేల్స్ లో తెలుగు పుస్తకం కొని.. అక్షరాలు నేర్చుకున్నా" అంటూ తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ అభిమానులు అందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. 

Updated Date - Mar 27 , 2025 | 05:34 PM