Dark Night: ఆ 'డార్క్ నైట్' పూర్ణ విషయంలో ఏం జరిగింది...
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:22 PM
పూర్ణ నటించిన కొన్ని సినిమాలు ఇప్పటికీ సెట్స్ మీద ఉన్నాయి. అవి నిదానంగా జనం ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి 'డెవిల్' (Devil). ఇది గత యేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైంది. ఇప్పుడు దానిని 'డార్క్ నైట్' (Dark Night) పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
హీరోయిన్ పూర్ణ (Poorna) ఇప్పుడు వెండితెర కంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. పలు టీవీ షోస్ లో సందడి చేస్తోంది. పెళ్ళి చేసుకుని పిల్లాడికి కూడా జన్మినిచ్చిన పూర్ణ గత యేడాది మహేశ్ బాబు నటించిన'గుంటూరు కారం' (Guntur Karam) మూవీలోని ఓ సాంగ్ లో మెరుపులా మెరిసింది. ఇదిలా ఉంటే పూర్ణ నటించిన కొన్ని సినిమాలు ఇప్పటికీ సెట్స్ మీద ఉన్నాయి. అవి నిదానంగా జనం ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి 'డెవిల్' (Devil). ఇది గత యేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైంది. ఇప్పుడు దానిని 'డార్క్ నైట్' (Dark Night) పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. పూర్ణ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో ఆమె సరసన త్రిగుణ్ (Trigun) హీరోగా నటించాడు. ఆదిత్ అరుణ్ పేరుతో పలు చిత్రాలలో నటించిన త్రిగుణ్ ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కే ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఇది కూడా అదే తరహాలో తెరకెక్కిన హారర్ మూవీ. విధార్థ్, సుభాశ్రీ రాయగురు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను పటోళ్ళ వెంకట రెడ్డి సమర్పణలో సురేశ్ రెడ్డి కొవ్వూరి తెలుగువారి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ను జి.ఆర్. ఆదిత్య డైరెక్ట్ చేశాడు. తొలికాపీ సిద్థమైన 'డార్క్ నైట్' మూవీ టీజర్ ను తాజాగా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటలను సోనీ మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
టీజర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత సురేశ్ రెడ్డి మాట్లాడుతూ, ''తెలుగులో వచ్చిన 'అవును, అవును -2' చిత్రాలలో పూర్ణ అద్భుతమైన నటన కనబర్చింది. ఈ సినిమాలో కూడా ఆమె నటన హైలైట్ గా ఉంటుంది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ను తమిళ రచయిత, దర్శకుడు జి.ఆర్. ఆదిత్య చాలా బాగా తెరకెక్కించారు. నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ ఈ కథ సాగుతుంది. తెలుగువారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. మార్చి నెల ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం'' అని అన్నారు.