Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో చిన్నారి పాప బ్యాక్ గ్రౌండ్ తెలుసా..

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:45 PM

Daaku Maharaaj: 'డాకు మహారాజ్' సినిమాలో చిన్ని పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఎంత ప్రధానమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ చిన్ని బ్యాక్ గ్రౌండ్ ఏంటని చెక్ చేస్తే మాములుగా లేదు.

vedha agarwal in daaku maharaaj

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొస్తుంది. ఈ సినిమాలో చిన్ని పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఎంత ప్రధానమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ చిన్ని బ్యాక్ గ్రౌండ్ ఏంటని చెక్ చేస్తే మాములుగా లేదు ఇప్పటికే తనని తానూ బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకుంది. చేసుకుంటూనే ఉంది. ఇంతకీ ఈ 'చిన్ని' చిన్నారి ఏం చేసింది ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..


ఈ మూవీలో వైష్ణవి అనే పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్న క్యూట్ కిడ్ పేరు వేద అగర్వాల్. ఈ సినిమాలో స్క్రీన్ పై కనిపినించిన ప్రతిసారి ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయే నటనతో మెప్పించింది. ఈ అమ్మాయి కేవలం యాక్టరే కాదు, సింగర్ కూడా. తన ఇన్ స్టాలో ఎప్పుడు తెగ యాక్టివ్ గా ఉంటూ.. 31000 మందికి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందింది. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్ లోనే స్థిరపడింది. ఈ ఎనిమిదేళ్ల చిన్నది ఇప్పటీకే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునలో షార్ట్ రోల్ చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'జాట్'లో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా 'డాకు మహారాజ్' షూటింగ్ ముగియడంతో ఓ ఎమోషనల్ వీడియో పెట్టింది.


ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్‌ ఖేడ్కర్‌)విద్యావేత్త. ఓ పెద్ద స్కూల్‌ని నడుపుతుంటాడు. తనకు పెద్ద కాఫీ ఎస్టేట్‌ ఉంటుంది. దాన్ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్‌) అక్కడ వన్య మృగాలను అక్రమంగా తరలిస్తుంటాడు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులు ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు, కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి కిడ్నాప్‌ చేస్తాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్‌ దేశపాండే చంబల్‌లోని మోస్ట్‌ వాంటెడ్‌ మహారాజ్‌ (బాలకృష్ణ)కు కబురు పెడతాడు. మహారాజ్‌ నానాజీగా పేరు మార్చుకొని ఆ పాపకు చ రక్షణగా ఉండటానికి వస్తాడు. అసలు ఈ మహారాజ్‌ ఎవరు? ఆ పాపకి తనతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథలో బల్వంత్‌ ఠాకూర్‌ (బాబీ డియోల్‌) నందిని (శ్రద్థా శ్రీనాథ్‌) ఎవరు? అసలు మహారాజ్‌, నానాజీగా పేరు ఎందుకు మార్చుకున్నాడు. తన శత్రువర్గం ఎవరు అన్నది కథ.

Updated Date - Jan 13 , 2025 | 04:20 PM