Daaku Maharaaj: మొదటి రోజు వసూళ్లు ఎంతో తెలుసా..
ABN , Publish Date - Jan 13 , 2025 | 02:06 PM
బాలకృష్ణ (NBK) హీరోగా సంక్రాంతి బరిలో విడుదలై చక్కని విజయాన్ని అందుకొంది ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) . దీంతో చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
బాలకృష్ణ (NBK) హీరోగా సంక్రాంతి బరిలో విడుదలై చక్కని విజయాన్ని అందుకొంది ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) . దీంతో చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసినట్లు టీమ్ (First Day collections) అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ఈ చిత్రం చేరింది. సినిమా ప్రకటించినప్పటి నుంచీ దర్శకుడు ఎంతో ధీమాగా ఉన్నారు. నమ్మకం వమ్ముకాకుండా సక్సెస్ అయినందుకు ఆయన ఆనందం రెట్టింపు అయింది. ఓవర్సీస్‌లో టికెట్స్ ఓపెన్ చేసిన నాటినుంచి బుకింగ్స్‌లో హవా చాటిన ‘డాకు మహారాజ్’ తొలిరోజు వన్ మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. దీంతో సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఓవర్సీస్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబీపై బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. అంతే కాదు సినిమా విడుదల తర్వాత జరిగిన పార్టీలో బాబీను బాలయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆయనపై ప్రేమ కురిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్థూ జొన్నలగడ్డ, విష్వక్‌సేన్‌లను బాలయ్య ఆప్యాయంగా పలకరించారు.