Allu Arjun: అల్లు అర్జున్.. రెండు షూరిటీలు.. ఒక బాండ్
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:05 PM
హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూచీకత్తు సమర్పించేందుకు, మేజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
హీరో అల్లు అర్జున్ (Allu arjun) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ (Nampally court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూచీకత్తు సమర్పించేందుకు, మేజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రెండు షూరిటీలను, వ్యక్తిగతంగా బాండ్ ను బన్నీ సమర్పించారు. అల్లు అర్జున్ పర్సనల్ మేనేజర్ మరొక షూరిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ వెంట ఆయన మావయ్య చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్ని తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షూరిటీస్ సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు చేరుకున్నారు.