UV Creations: సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ పూర్తి
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:54 AM
సంతోష్ శోభన్ కు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ తన అదృష్టం పరీక్షించుకుంటూనే ఉన్నాడు. అతని తాజా చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' షూటింగ్ పూర్తయ్యింది.
గత యేడాది జూలై మాసంలో సంతోష్ శోభన్ (Santhosh Sobhan) పుట్టిన రోజు సందర్భంగా అతని తాజా చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly) మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ యేడాది వేలంటైన్స్ డే సందర్భంగా దీనిని విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ యథావిధిగా ఈ సినిమా షూటింగ్ సైతం అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 14న విడుదల కాలేదు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) దీనికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ను ఇచ్చింది. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపింది. సంతోష్ శోభన్ సరసన 'కపుల్ ఫ్రెండ్లీ'లో మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్ గా నటిస్తోంది.
చెన్నై నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. దీనిని తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు. ఆదిత్య రవీంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేయడానికి సన్నానాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమౌతున్న సంతోష్ శోభన్ కు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ గ్రాండ్ సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.
Also Read: Pushpa 3: పుష్ప ర్యాంపేజ్ వచ్చేది ఎప్పుడంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి