Vishwambhara: బాసు.. ఇదేనా అసలు మేటర్

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:28 PM

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. మరి రిలీజ్ విషయంలో ఎందుకు ఇంతా ఆలస్యం అనే ప్రశ్నలు లేవనెత్తనున్నారు అభిమానులు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంతా సమయం పట్టే ఛాన్సే లేదు. మరి అసలు విషయం ఏంటంటే..

Vishwambhara Release Strategy Revealed

మెగా అభిమానులకు ఈ మధ్యన అసలు కలిసి రావడం లేదు. ఒక వైపు వరుణ్ తేజ్ 'మట్కా', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తీవ్ర నిరాశపరచగా మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని సందిగ్ధం ఒకవైపు. ఇక చిరంజీవి 'విశ్వంభర' చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పటికి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అలాగే.. సినిమా షూటింగ్, మరికొన్ని పనులు పెండింగ్ ఉండటం అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. అయితే విశ్వంభర రిలీజ్ విషయంలో ఓ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారట బాస్. ఇంతకీ ఆ సంగతి ఏంటంటే..


మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సింది. కానీ.. 'గేమ్ ఛేంజర్' కోసం వాయిదా పడింది. ఇప్పడు ఏకంగా మే నెలలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. మరి దేనికి ఇంతా ఆలస్యం అనే ప్రశ్నలు లేవనెత్తనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంతా సమయం పట్టే ఛాన్సే లేదు. మరి అసలు విషయం ఏంటంటే


ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ కి చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ప్రధానంగా గ్రాఫిక్స్ విషయంలో. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విఎఫ్ఎక్స్ టీమ్ ని మార్చేసినట్లు తెలుస్తోంది. అలాగే చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు మే 9న రిలీజ్ అయ్యాయి. దీంతో 'విశ్వంభర'ని కూడా అదే తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read- Coldplay: 'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో మార్మోగిన తెలంగాణ పేరు

Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

Also Read-Baapu Teaser: 'బలగం' లాంటి మరో కథ.. బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 09:31 PM