Mega Nandamuri Bond: నటనలో తండ్రికి తగిన వాడు, సంస్కారంలో మించిన వాడు
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:47 PM
Mega Nandamuri Bond: ఇప్పటివరకు చిరంజీవితో తాను పోటీ పడ్డానని.. ఇక నుంచి నీతోనే పోటీ అంటూ చరణ్‌తో బాలయ్య అన్నారు. సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ మెగా వర్సెస్ నందమూరి అంటూ యుద్దాలు చేస్తుంటారు. కానీ.. వాళ్ళ కుటుంబాల మధ్య అనుబంధం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు.
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కొందరు అభిమానులు మెగా వర్సెస్ నందమూరి అంటూ యుద్దాలు చేస్తుంటారు. కానీ.. వాళ్ళ కుటుంబాల మధ్య అనుబంధం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్య అనుబంధాల గురించి ఓ టీవీ షోలో బహిర్గతం అయ్యాయి. ఈ సంక్రాంతి సినీ రేసులో మెగా ఫ్యామిలీ నుండి 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్, నందమూరి ఫ్యామిలీ నుండి 'డాకు మహారాజ్'గా బాలకృష్ణ పోటీలో నిలవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాల ప్రమోషన్ కోసం వీరిద్దరూ ఆహా ప్లాట్ ఫామ్ ఆన్ స్టాపబుల్ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
చిరంజీవి ఫ్యామిలీ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన కొత్తలో బాలకృష్ణ తన పిల్లలతో కలిసి ఇంటికి వచ్చి, నైట్ డిన్నర్ కి తీసుకెళ్లారనే విషయాన్ని రామ్ చరణ్ చెప్పారు. అలాగే రామ్ చరణ్ తల్లి సురేఖ కుకింగ్ లో రొయ్యలు, ఆమ్లెట్ అదరగొడతారని బాలయ్య చెప్పారు. క్లింకార గురించి చరణ్ మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్లే అని ఎమోషనల్ అయ్యాడు. దీంతో బాలయ్య క్లింకారని అందరికి ఎప్పుడు చూపిస్తావ్ అని అడిడారు. దానికి చరణ్.. క్లింకార ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే ప్రపంచానికి రివీల్ చేస్తానని చెప్పారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. 'చరణ్ నటనలో తండ్రికి తగిన వాడు, సంస్కారంలో తండ్రికి మించిన వాడు' అంటూ కామెంట్ చేశాడు. అలాగే..ఇప్పటివరకు చిరంజీవి తో తాను పోటీ పడ్డానని.. ఇక నుంచి నీతోనే పోటీ అంటూ చరణ్ తో బాలయ్య సరదాగా ముచ్చటించారు. ఇప్పటివరకు మెగా నందమూరి కుటుంబం మధ్య అనుబంధం గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ వీపరీతమైన వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.