Chiranjeevi: ఫ్లైట్‌లో చిరు వివాహ వార్షికోత్సవం.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:23 PM

మెగాస్టార్  చిరంజీవి (Megastar Chiranjeevi) - సురేఖ (Surekha) దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకొన్నారు. గురువారం తమకు ఎంతో ప్రత్యేకమైన ఈరోజును ఫ్లైట్‌లో ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో చిరంజీవి దంపతులు సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం

మెగాస్టార్  చిరంజీవి (Megastar Chiranjeevi) - సురేఖ (Surekha) దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకొన్నారు. గురువారం తమకు ఎంతో ప్రత్యేకమైన ఈరోజును ఫ్లైట్‌లో ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో చిరంజీవి దంపతులు సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. దీనికి  సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్‌ వేదికగా అభిమానులతో  పంచుకున్నారు. స్నేహితుల సమక్షంలో పెళ్లి రోజును సెలబ్రేట్‌ చేసుకోవడం సంతోషంగా ఉందని చిరు తెలిపారు. వేడుకల్లో భాగంగా దుబాయ్‌కు వెళ్తున్నట్లు చెప్పారు.

‘‘నా కలల జీవిత భాగస్వామిగా సురేఖ నా జీవితంలోకి అడుగుపెట్టినందుకు నేనెప్పుడూ అదృష్టంగా ఫీలవుతుంటా. ఆమే నా ధైర్యం. నమ్మకం. ప్రపంచంలో తెలియని ఎన్నో గొప్ప విషయాలను కనుగొనేందుకు ఎల్లప్పుడూ సాయం చేస్తుంటుంది. ఆమె ఉనికి అద్భుతమైన ప్రేరణని ఇస్తుంది. ఆమె అంటే నాకెంత ఇష్టమో తెలియజేసేందుకు ఈ క్షణాలను సద్వినియోగం చేసుకుంటున్నా. థాంక్యూ మై సోల్‌మేట్‌ సురేఖ.  మాకెంతో ప్రత్యేకమైన ఈ రోజున విషెస్‌ చెప్పిన కుటుంబసభ్యులు, స్నేహితులు ఆత్మీయులకు ధన్యవాదాలు’’ అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. ఫ్లైట్‌ జర్నీలో చిరంజీవి దంపతులతో నాగార్జున(nagarjuna), అమల(Amala), నమ్రత (Namratha) తదితరులు ఉన్నారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి విషెస్‌ చెప్పారు.

Updated Date - Feb 20 , 2025 | 06:25 PM