Chiranjeevi: ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:18 PM

బ్రిటన్‌ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో  జరిగిన సత్కారంపై చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.  లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న అయన ఆనంద, వ్యక్తం చేసారు. 

బ్రిటన్‌ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో  జరిగిన సత్కారంపై చిరంజీవి (Chiranjeevi) సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.  లైఫ్ టైం అచీవ్ మెంట్ (life Time Achivement Award) అవార్డు అందుకున్న అయన ఆనంద, వ్యక్తం చేసారు.   తన ఆనందం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవంటూ.. ఈ జర్నీలో భాగమైన కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.  '‘యూకే పార్లమెంట్‌ (UK)సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో.. నన్ను సత్కరించినందుకు హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ‘బ్రిడ్జ్‌ ఇండియా’ (Bridge india) సంస్థ జీవిత సాఫల్య పురస్కారం నేను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

సినీ రంగానికి, సమాజానికి చిరంజీవి చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు ‘బ్రిడ్జ్‌ ఇండియా’ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  యువీ క్రియేషన్స్‌, ‘విశ్వంభర’ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపాయి. 

Updated Date - Mar 20 , 2025 | 04:22 PM