Chiranjeevi: బంగారు కోడిపెట్ట పోయిందంటూ చిరు ఆసక్తికర వీడియో
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:36 PM
చిరంజీవి తన ఇంట్లో పెంచుకుంటున్న కోడి పెట్టను పోగొట్టుకున్నారు. అది అలాంటి.. ఇలాంటి కోడి కాదు.. బంగారు కోడిపెట్ట. ఇంతకీ ఆ కోడి కోసం వెతుకున్న చిరంజీవి ఏమంటున్నారో చూద్దాం. పారిపోయిన కోడిని వెతుకుతూ కనిపించారు చిరు. ఏమని ఆరా తీయగా ఆ బంగారు కోడి పెట్ట కథ ఏంటో చెప్పారు.
చిరంజీవి (Chiranjeevi) తన ఇంట్లో పెంచుకుంటున్న కోడి పెట్టను పోగొట్టుకున్నారు.
అది అలాంటి.. ఇలాంటి కోడి కాదు.. బంగారు కోడిపెట్ట (bangaru kodipetta).
ఇంతకీ ఆ కోడి కోసం వెతుకున్న చిరంజీవి ఏమంటున్నారో చూద్దాం.
పారిపోయిన కోడిని వెతుకుతూ కనిపించారు చిరు. ఏమని ఆరా తీయగా ఆ బంగారు కోడి పెట్ట కథ ఏంటో చెప్పారు.
ఘరానా మొగుడు సినిమాలో 'బంగారు కోడిపెట్ట వచ్చినండి.. ఏ పాపా.. ఏ పాపా’ పాట వినగానే గుర్తొచ్చేది చిరంజీవి ఐకానిక్ స్టెప్పులు. తదుపరి కీరవాణి అందించిన సంగీతం. ఆ పాట ఎంతగా పాపులరో తెలిసిందే! ఇప్పుడు కీరవాణి (MM Keeravani music concert) హైదరాబాద్‌లో ఓ లైవ్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. దానికి కీరవాణి తనదైన శైలిలో ప్రోమో తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కీరవాణి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో స్టార్టింగ్‌లో చిరంజీవి ఏదో వెతుకుతూ కనిపిస్తారు.
అనంతరం ఆయన ఏం చెప్పారంటే.. "హాయ్... ఏంటి వెతుకుతున్నానని అనుకుంటున్నారా...? మా ఇంట్లో ఒక కోడిపెట్ట ఉందండీ... అది పారిపోయింది. మామూలు కోడిపెట్ట కాదు... బంగారు కోడిపెట్ట. దానికోసం దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కంప్లైయింట్ ఇచ్చాను. ఎక్కడైనా బంగారు కోడిపెట్ట ఉంటుందా అని వాళ్లు ఎగతాళిగా నవ్వుతున్నారు. నన్ను నమ్మడంలేదు. కానీ, మార్చి 22 సాయంత్రం హైదరాబాదు టాకీస్ వారు కీరవాణి ఆధ్వర్యంలో ఒక సంగీత కచేరి జరగబోతోంది. బంగారు కోడిపెట్ట అక్కడ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. నాకూ నమ్మకమే... ఆ బంగారు కోడిపెట్టను పట్టుకోవడానికి కొంత మందిని పంపిస్తాను. మీరు కూడా అక్కడికి వెళ్లండి.. నా బంగారు కోడిపెట్టను పట్టుకోండి... వాటేసుకోండి. తీసుకొచ్చేసేయండి’’ అని సరదాగా ఆ వీడియోలో మాట్లాడారు.
దీనికి కీరవాణి స్పందిస్తూ, బంగారు కోడిపెట్ట సాంగ్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ‘‘చిరంజీవి గారూ... మీ మాటలతో మళ్లీ ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు. అందరూ సిద్థంగా ఉండండి... మీ కోసం బంగారు కోడిపెట్టను తీసుకువస్తున్నాను... మార్చి 22న హైదరాబాదులోని హైటెక్స్ లో కలుసుకుందాం’’ అని కీరవాణి పేర్కొన్నారు.