Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 02:55 PM

Mega Star Chiranjeevi: "ఎవరైనా భూములు ఉంటే రియల్ ఎస్టేట్ చేస్తారు.. డబ్బులు ఉంటే వ్యాపారం చేస్తారు.. కానీ ఫ్యాషన్‌తో ఇక్కడ పార్క్ డెవలప్ చేశారు"

Megastar Chiranjeevi At Experium Park Inauguration

మెగాస్టార్ చిరంజీవి ప్రకృతి ఒడిలో పరవశించారు. తాజాగా హైదరాబాద్, చిలుకూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియం పార్క్ ఓపెనింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరవశించిపోయారు. ఇది కేవలం పార్కు కాదు కళాహృదయంతో చూడాల్సిన గొప్ప కళాఖండం అని పేర్కొన్నారు.


చిరంజీవి మాట్లాడుతూ... ‘‘ఎక్స్ పీరియం పార్క్ మీకంటే ముందు నాకు బాగా నచ్చింది. ఎక్స్ పీరియం పార్క్ హైదరాబాద్‌కు తలమణికంగా మారుతుంది. రామ్‌దేవ్ 2000 సంవత్సరంలో మొదలు పెట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చెట్లు అన్ని నన్ను టెంప్ట్ చేస్తున్నాయి. రామ్‌దేవ్ చాలా రీసెర్చ్ చేసి విదేశాల మొక్కలు తెచ్చి నాటారు. ఇక్కడ అద్భుతమైన కలాఖండాన్ని నిర్మించారు’’ అంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి ఈ పార్క్‌ను చూసి ముచ్చట పడ్డారని తెలిపారు. ఈ పార్క్‌లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చని తెలిపారు.


ఈ పార్క్‌తో చాలా మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రామ్‌దేవ్ ఒక వ్యాపారిలా కనిపించరని.. ఆయన ఒక కళాకారునిగానే కనిపిస్తారన్నారు. హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని తెలిపారు. 25 ఏళ్లుగా రామ్‌దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు. ఎవరైనా భూములు ఉంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారని.. డబ్బులు ఉంటే వ్యాపారం చేస్తున్నారని.. కానీ రాందేవ్ ఫ్యాషన్‌తో ఇక్కడ పార్క్ డెవలప్ చేశారని చెప్పారు. వచ్చే చలికాలంలో ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తా అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.


చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 150 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్‌ అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్‌, అందమైన శిలలు సేకరించి గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.

Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు

Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 02:55 PM