NBK : పద్మభూషణ్ బాలయ్యకు అభినందనల వెల్లువ..
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:33 AM
మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సహా పద్మ పురస్కారాలు వరించిన డా. డి నాగేశ్వరరెడ్డి, నటుడు అజిత్9Ajith Kumar), రుద్రవీణ ఫేం శోభన, అనంత్ నాగ్, శేఖర్ కపూర్, సింగర్ అర్జిత్ సింగ్, మాడుగు నాగఫణి శర్మలకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
పద్మభూషణ్ పురస్కారం పొందిన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై (Balakrishna) ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సహా పద్మ పురస్కారాలు వరించిన డా. డి నాగేశ్వరరెడ్డి, నటుడు అజిత్9Ajith Kumar), రుద్రవీణ ఫేం శోభన, అనంత్ నాగ్, శేఖర్ కపూర్, సింగర్ అర్జిత్ సింగ్, మాడుగు నాగఫణి శర్మలకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సోదరుడు నందమూరి బాలకృష్ణను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌తో సత్కరించడం చాలా గర్వంగా భావిస్తున్నాను. సినిమా మరియు ప్రజా సేవకు మీరు చేసిన సేవలకు తగిన గుర్తింపు. మరెన్నో అవార్డులు రావాలి! అభినందనలు అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు చెబుతు ట్వీట్ చేశారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలయ్యకు మనస్ఫూర్తిగా అభినందనలు. భారతీయ సినిమాలో మీ ప్రయాణం అభినందనీయం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఈ అవార్డును అందుకోవడానికి మీరు పూర్తి అర్హులు’’ - మహేశ్‌బాబు
బాల బాబాయికి అభినందనలు: జూ.ఎన్టీఆర్
ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య బాబాయికి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు సినిమా రంగానికి మీరు చేసిన అసమానమైన సేవలకు మీ నిర్విరామ ప్రజా సేవకు నిదర్శనం అని ఎన్టీఆర్ (Jr NTR)ట్వీట్ చేశారు.
బాబాయ్ కృషికి సరైన గుర్తింపు: కల్యాణ్ రామ్
ప్రతిష్టాత్మక పద్మ్ఘభూషణ్ అవార్డుకు ఎంపికైన బాబాయ్ నందమూరి బాలకృష్ణకి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు ((KalyanRam)