Chiranjeevi: చిరంజీవి తల్లికి అస్వస్థత.. టీమ్ స్పందన ఇదే!
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:13 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనమ్మ అస్వస్థతకు (Anjanamma Hospitalised) గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనమ్మ అస్వస్థతకు (Anjanamma Hospitalised) గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ తెలిపింది. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వివరించారు.
ఉదయం అంజనాదేవికి అస్వస్థత అనే వార్తలు ఒక్కసారిగా రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వెళ్లారు అని తెలిసి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు