Chiranjeevi: చిరంజీవి - అనిల్‌ రావిపూడి సినిమా అప్‌డేట్‌

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:49 AM

చిరంజీవి అనిల్‌ రావిపూడితో (Anil Ravipudi) ఓ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి సాహు గారపాటి(Sahu Garapati) , కొణిదెల సుష్మిత 9Sushmita Konidela) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. నానితో 'ది పారడైజ్‌’ సినిమా చిత్రీకరణ తర్వాతే చిరంజీవితో సినిమా మొదలుపెడతారని తెలుస్తోంది.

చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'విశ్వంభర’ (Vishwambhara) చిత్రీకరణ చివరి దశలో ఉంది. తదుపరి దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను ప్రకటించారు. ఇదిలా ఉండగా చిరంజీవి అనిల్‌ రావిపూడితో (Anil Ravipudi) ఓ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి సాహు గారపాటి(Sahu Garapati) , కొణిదెల సుష్మిత 9Sushmita Konidela) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్‌తో నానితో 'ది పారడైజ్‌’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తర్వాతే చిరంజీవితో సినిమా మొదలుపెడతారని తెలుస్తోంది. అయితే 'విశ్వంభర' పూర్తి కాగానే చిరంజీవి అనిల్‌ రావిపూడి సినిమా సెట్‌లో అడుగుపెడతారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. (Chiranjeevi - Anil Ravipudi movie update)




అయితే సెంటిమెంట్‌గా ఈ నెల 17, 18 తేదిల్లో వైజాగ్‌లో ఈ చిత్రానికి 'ఓం’ రాసి కథా చర్చలు మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని అనిల్‌ రావిపూడి తెలిపారు. పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, చాలా కాలం తర్వాత ఇలాంటి కథను చేస్తున్నానని చిరంజీవి చెప్పారు. సమ్మర్‌లో సెట్స్‌ మీదకెళ్లనుందని వెల్లడించారు.

ప్రస్తుతం అనిల్‌ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు నుంచి సక్సెస్‌ ఫుల్‌గా నెల రోజు పూర్తి చేసుకునే వరకూ సినిమాను ప్రమోట్‌ చేశారు. సోమవారం జరిగిన విక్టరీ వేడుకతో సినిమా ప్రమోషన్స్‌కు స్వస్త పలికినట్లు తెలుస్తోంది. ఇక ఆయన దృష్టి అంతా చిరంజీవి సినిమాపైనే పెట్టనున్నారు. 

Updated Date - Feb 11 , 2025 | 11:50 AM