SKN: చిరుపై అవాకులు.. చెవాకులు.. పిచ్చి ఆనందం కోసమే

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:50 PM

‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన మంచి మనసు గురించి తెలియజేస్తూ

‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన మంచి మనసు గురించి తెలియజేస్తూ ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ (SKN) ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. కొంతమంది కావాలని ఇలాంటి విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం చిరంజీవిది. నిజమైన ఫ్యామిలీ మ్యాన్‌ ఆయన. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఆయనపై ఊరికే అవాకులు చవాకులు పేలడం అనవసరంగా రాద్థాంతం చేయటం తద్వారా పిచ్చి ఆనందం పొందటం కొందరికి అలవాటు’’ అని విమర్శించారు.


హస్యనటుడు బ్రహ్మానందం(Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న చిరంజీవి తన కుటుంబ వారసత్వంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. స్టార్‌ హీరో అయుండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని కామెంట్స్‌ చేశారు. మరోవైపు, ఆయన మాటలను కొంతమంది సరదాగా తీసుకుంటున్నారు. ఇంట్లో అంతా మనవరాళ్లే ఉన్నారు. మనవడితో సరదాగా గడపాలనుందనే ఉద్దేశంతో చిరంజీవి అలా మాట్లాడారని సన్నిహితులు చెబుతున్నారు.  రామ్‌చరణ్‌ని ఈ సారైనా మగబిడ్డని ఇవ్వరా అని అంటుంటాను అని  సరదాగా చెప్పారు చిరు. 

Updated Date - Feb 13 , 2025 | 05:50 PM