Chiranjeevi: అమ్మ ఆరోగ్యం.. చిరంజీవి క్లారిటీ
ABN , Publish Date - Feb 22 , 2025 | 10:29 AM
తన తల్లి అంజనాదేవి (Konidela Anjana Devi) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్లారిటీ ఇచ్చారు. ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.
తన తల్లి అంజనాదేవి (Konidela Anjana Devi) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్లారిటీ ఇచ్చారు. ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. "మా అమ్మ ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. రెండు రోజులుగా ఆమె ఒంట్లో కాస్త నలతగా మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి, దయచేసి అసత్య వార్తలను రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా" అని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. (Anjana Devi Health)
అంజనాదేవి ఆరోగ్యంపై శుక్రవారం ఉదయం నుంచి సిసిల మీడియాలో పలు వార్తలు వచ్చాయి. దీనిపై చిరంజీవి టీమ్ అప్పటికే స్పష్టత ఇచ్చింది. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. తాజాగా చిరంజీవి కూడా స్పష్టత ఇవ్వడంతో అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.