Chiranjeevi: రామ్‌చరణ్‌ పెద్ది లుక్‌పై చిరంజీవి కామెంట్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:57 PM

తన తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని స్పెషల్‌గా విషెస్‌ తెలిపారు మెగాస్టార్‌ చిరంజీవి. చరణ్‌ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్‌ చేశారు.

తన తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని స్పెషల్‌గా విషెస్‌ తెలిపారు మెగాస్టార్‌ చిరంజీవి. చరణ్‌ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్‌ చేశారు. పోస్టర్‌లో చరణ్‌ లుక్‌ చాలా అద్భుతంగా ఉందని ట్వీట్‌ చేశారు.  తప్పకుండా సినీ ప్రియులకు ఇది ఒక మంచి ట్రీట్‌ కానుందని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ చరణ్‌. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నమ్ముతున్నా’’ అని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.  


rc.jpgఅలాగే సినీ ప్రముఖులు చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్‌ పెడుతున్నారు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.  

‘‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌. ‘పెద్ది’ లుక్‌ అద్భుతంగా ఉంది. మీ విలక్షణ నటనతో మమ్మల్ని తరచూ ఆశ్చర్యపరుస్తూనే గర్వపడేలా చేయండి’’
- అనిల్‌ రావిపూడి


‘‘నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు.. తీసుకో బావ నా ఈ బండ ప్రేమను’’


- సాయిదుర్గ తేజ్‌

‘‘హ్యాపీ బర్త్‌డే చరణ్‌. ఉపాసన, క్లీంకార ఈ రోజును అద్భుతంగా మారుస్తారు.  నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’

- కాజల్‌ 

Updated Date - Mar 27 , 2025 | 02:09 PM