Chiranjeevi: చాలా సంవత్సరాల తర్వాత ఆ తరహా కథలో 

ABN , Publish Date - Feb 10 , 2025 | 08:03 AM

తదుపరి ఆయన అనిల్‌ రావిపూడితో (Anil Ravipudi) సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. దానిపై దర్శకుడు ఇండైరెక్టర్‌గా స్పందించారు కానీ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు.

చిరంజీవి (Chiranjeevi) యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. క్రేజీ డైరెక్టర్లతో సినిమాలను లైనప్‌లో ఉంచారు.  ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' (Visjwambhara( చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అది సెట్స్‌ మీద ఉండగానే దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెలతో (Srikanth odela) ఓ చిత్రాన్ని ప్రకటించారు. హీరో నాని ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తదుపరి ఆయన అనిల్‌ రావిపూడితో (Anil Ravipudi) సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. దానిపై దర్శకుడు ఇండైరెక్టర్‌గా స్పందించారు కానీ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. 

తాజాగా ఈ చిత్రం గురించి చిరంజీవి అధికారికంగా వెల్లడించారు. విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ‘లైలా’ ప్రీరిలీజ్‌ వేడుకలో తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. "అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. సాహు గారపాటి, కొణిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ వేసవిలోనే షూటింగ్‌ ప్రారంభమవుతుంది. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పూర్తి వినోదాత్మక చిత్రం చేస్తున్నా’’ అన్నారు చిరంజీవి.


ఇక అనిల్‌ రావిపూడి చిత్రాల స్టైల్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వినోదంతోపాటు చక్కని భావోద్వేగాలు ఆయన చిత్రాల్లో ఉంటాయి. ఆయన కామెడీ స్టైల్‌కు చిరంజీవి తోడైతే అంచనాలు ఆకాశానికి చేరతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ జోరులో ఉన్నారు. 

Updated Date - Feb 10 , 2025 | 10:13 AM