Chiranjeevi: చిరు - శ్రీకాంత్ ఓదెల సినిమా.. అప్డేట్ ఇచ్చిన నాని
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:26 PM
చిరంజీవి కథానాయకుడిగా నాని ఓ సినిమా నిర్మించనున్నారు. 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాతగా నాని ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు.
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నాని (Nani) ఓ సినిమా నిర్మించనున్నారు. 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth ODela) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నానితో 'ప్యారడైజ్’ (Paradise) సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక చిరంజీవి సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాతగా నాని ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభించుకోనుందని నాని స్వయంగా వెల్లడించారు. శుక్రవారం జరిగిన 'కోర్ట్' (Court) సినిమా కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవల హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను తెరకెక్కించారు దర్శకుడు వశిష్ట. ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సక్సెస్‌లో ఉన్న అనిల్ ప్రస్తుతం చిరు చిత్రం కథా చర్చల్లో ఉన్నారు.
ఇక నాని విషయానికొస్తే.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీశ్ దర్శకుడిగా నాని సమర్పణలో 'కోర్ట్' సినిమా తెరకెక్కింది. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో నాని ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఫస్ట్ హియరింగ్ విత్ మీడియా పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.