Chiranjeevi: ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం వేరు
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:36 PM
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 'మెగా ఉమెన్స్' (Mega womens) పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అమ్మ అంజనాదేవి (Anjana Devi), చెల్లెళ్లు మాధవి, విజయదుర్గ, సోదరుడు నాగబాబు(Nagababu)తో ఇంటర్వ్యూ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే మేము ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు . అదే ఇప్పటికి ఫాలో అవుతున్నాం అని చిరంజీవి అన్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 'మెగా ఉమెన్స్' (Mega womens) పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అమ్మ అంజనాదేవి (Anjana Devi), చెల్లెళ్లు మాధవి, విజయదుర్గ, సోదరుడు నాగబాబు(Nagababu)తో ఇంటర్వ్యూ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తమ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
"ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా మాకు అమ్మానాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. అమ్మ సైడ్ ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ సైతం మా నాన్న గారి ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు. అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు.
మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు చేసి బాగా కష్టపడుతున్నాడు.. బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెడుతుంటారు. కళ్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా తెలియకపోయినా అమ్మకి మాత్రం తెలిసిపోతుంది. నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్చ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం’అని అన్నారు.
చరణ్ గుర్రంపై నుంచి పడినప్పుడు..
చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛను ఇచ్చారు. సినిమాల్లోకి వెళ్తానంటే కాస్త భయపడినప్పటికీ కాదని మాత్రం చెప్పలేదు. వాళ్లు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మరింత బాధ్యతాయుతంగా ముందుకుసాగాను. షూటింగ్స్‌లో అలసిపోయి వచ్చినప్పుడు నాన్న నాకెంతో సపోర్ట్‌గా ఉండేవారు. అమ్మలా నన్ను చేరదీసేవారు. ‘గూండా’ షూటింగ్ సమయంలో ట్రైన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నాన్న అక్కడే ఉన్నారు. షూట్ పూర్తికాగానే నాపై కోప్పడ్డారు. ‘ఎందుకు ఇలాంటివి అన్నీ చేస్తుంటావ్’ అని కేకలు వేశారు. మరేం ఫర్వాలేదని నేను నచ్చజెప్పినప్పటికీ.. ‘రేపు నీకొక కొడుకు పుట్టి.. వాడు ఇలాంటివి చేస్తుంటే నా భయం ఏమిటో నీకు తెలుస్తుంది’ అనేవారు. ‘మగధీర’ షూట్‌లో గుర్రంపై నుంచి చరణ్ పడిపోయాడు అని విన్నప్పుడు.. ఆ రోజుల్లో నాన్న నా విషయంలో ఏవిధంగా ఫీలయ్యారో మొదటిసారి నాకు చరణ్ విషయంలో అలాంటి కంగారు వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో పీటర్ హెయిన్స్ ఒక స్టంట్ చేస్తూ కిందపడిపోతే ఏడెనిమిది నెలల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. చరణ్‌కు ఏమవుతుందోనని నేనెంతో భయపడ్డాను.