Chiranjeevi: వద్దన్న దర్శకుడితోనే ఎన్టీఆర్‌ కంటే ఎక్కువ సినిమాలు చేసేలా..

ABN , Publish Date - Jan 06 , 2025 | 09:31 AM

"నా అఛీవ్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), నా అఛీవ్‌మెంట్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) , మా కుటుంబంలో అందరూ నా అఛీవ్‌మెంట్సే. వాళ్లను చూస్తుంటే  ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది అని చిరంజీవి అన్నారు


"నా అఛీవ్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), నా అఛీవ్‌మెంట్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) , మా కుటుంబంలో అందరూ నా అఛీవ్‌మెంట్సే. వాళ్లను చూస్తుంటే  ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. 'అన్నయ్య నువ్వు ఓ మాట అనేవాడివి గుర్తుందా.. మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు, ఇది నాతో ఆగిపోకూడదు. ఓ రాజ్‌ కపూర్‌ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో, అలాగే మరో రాజ్‌ కపూర్‌ ఫ్యామిలీగా మన మెగా కుటుంబం కావాలి అని నువ్వు చెప్పావు. ఈరోజు నీ మాట మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నాం. అది నీ మాట పవర్‌ అని కల్యాణ్‌ బాబు ఈ మధ్యనే అన్నాడు’’ అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.  అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌(ఆప్త) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ‘క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌-2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై అలనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. (Chiranjeevi)

 
ఐరన్‌లెగ్‌ అంటారేమోనని... 

‘‘అప్పుడప్పుడు పాండి బజార్‌ వెళ్లినప్పుడు.. అప్పటికే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు నన్ను నిరుత్సాహపరిచేవారు. ఆంజనేయ స్వామికి చెప్పుకొనేవాడిని. ‘నెగెటివిటీ ఉన్న చోటికి నిన్ను ఎవరు వెళ్లమన్నారు? పాజిటివ్‌గా ఉంటూ విజయం సాధించు’ అని ఆయన నాకు చెప్పినట్టు అనిపించేది. సినిమాల్లో నెంబరు 1 అవ్వాలని ఫిక్స్‌ అయ్యా. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. లక్ష్యాన్నే తప్ప మిగిలిన వాటిని పట్టించుకోలేదు. రామారావు గారితో కలిసి ‘తిరుగులేని మనిషి’లో నటించా. అది ఫెయిల్‌ అయింది. అయినా ఆయనతో కలిసి నటించే అవకాశం మరొకటి వచ్చింది. నా డేట్స్‌ కూడా తీసుకున్నారు. ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటే.. నా స్థానంలో మరో నటుడిని తీసుకుని సినిమాని ప్రకటించారు. ఎంతో బాధపడ్డా. నిర్మాతను అడిగితే ‘మీ కాంబోలో వచ్చిన ఓ చిత్రం సక్సెస్‌ కాలేదు కదా. అందుకే వద్దనుకున్నాం. దాంతో నాతో సినిమా  చేస్తే  ఆడదనే ప్రచారం జరిగే పరిస్థితి నెలకొంది. ఐరన్‌లెగ్‌ అంటారేమోనని భయపడ్డాను. ఎవరైతే నన్ను వద్దనుకున్నారో ఆయనతోనే ఎన్టీఆర్‌గారికంటే ఎక్కువగా నాతో సినిమాలు తీేసలా చేసుకున్నా. నెగెటివిటీకి కుంగిపోకూడదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ఎదగాలి. ఆ డైరెక్టర్‌తోనే నా రికార్డులున్నాయి. మీ బలం మీ పాజిటివ్‌ థింకింగ్‌. కెరీర్‌ ఆరంభంలో సంపాదన ప్రధానం కాదు మనల్ని మనం నిలబెట్టుకోవడం ముఖ్యం. క్రమశిక్షణతో ఉండాలి. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్లాక.. ఎందరో గొప్ప నటులున్నా నాలాంటి కొత్త వాడికి అవకాశాలు రావడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలెంట్‌ ఉంటే సరిపోదు వ్యక్తిత్వం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముందుగా నన్ను ప్రేక్షకులే గుర్తించారు తప్ప ఇండస్ట్రీ కాదు’’


 కాలర్‌ ఎగరేస్తే ఏమవుతుందో నాకు తెలుసు
‘‘రామారావు గారి అనంతరం ఎవరనే చర్చ జరిగింది. ఇద్దరు, ముగ్గురం పోటా పోటీగా ఉన్నాం. విజయవాడకు చెందిన లక్ష్మీ ఫిలిం డిస్ర్టిబ్యూటర్స్‌ సీఈవో.. ఎక్కువ బడ్జెట్‌తో నాతో సినిమా చేేసందుకు ఆసక్తి చూపారు. ‘కొత్త నటుడికి ఎందుకంత?’ అని నిర్మాతలని అడిగితే..‘ఖైదీ’లోని ఆయన డ్యాన్స్‌, ఫైట్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. మేం ఎప్పుడూ ఫీల్డ్‌లో ఉంటూ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటామని చెప్పేవారు. ఆ తర్వాత రామారావు గారి నిర్మాతలంతా నాతో సినిమాలు చేసేందుకు వచ్చేవారు. నెంబరు 1 హీరో అవ్వాలనుకున్న నాకు ఆ క్షణం అయ్యానని అనిపించింది. కాలర్‌ ఎగరేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే అణిగిమణిగి ఉంటూ నెంబరు-1 అనే మాటను మనసులోంచి తీసేశా. కష్టపడుతూ వెళ్తే నెంబరు అలానే ఉంటుందని నమ్మా. ఒకే ఒక జీవితం.. అనుకున్నది సాధించాలి. పవన్‌ కల్యాణ్‌.. రామ్‌ చరణ్‌.. నా కుటుంబమంతా నా అఛీవ్‌మెంట్‌. బాలీవుడ్‌లో రాజ్‌కపూర్‌లానే మనం కూడా అలా అవ్వాలని నేను చెప్పిన మాటను పవన్‌ ఇటీవల గుర్తుచేశాడు. అనుకోకుండా.. ఓ పత్రిక ‘కపూర్‌ ఫ్యామిలీ ఆఫ్‌ సౌత్‌’ అని మా గురించి ప్రస్తావించడం ఆనందకరం’’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 09:31 AM